Ravindra Jadeja Half Century: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో భారత జట్టు 6 వికెట్లకు 269 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. అశ్విన్, జడేజా ఇద్దరు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో మూడో సెషన్‌లో భారీ స్కోర దిశగా భారత్ ముందుకు సాగుతోంది.
Jaddu 50👑👑👑 pic.twitter.com/9MhC5UVLTP
ఇవి కూడా చదవండి— HULK (@HULK_MCFC) September 19, 2024
రవిచంద్రన్ అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం కూడా ఉంది. 73 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉంది.
Out comes the Sword Celebration ™️
Jaddu carves out a fierce 50 ⚔️#PlayBold #INDvBAN #TeamIndia pic.twitter.com/GWYLZoDmoE
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 19, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..