IND vs ENG: ‘500లు.. 501కి మధ్య 48 గంటలు’: అశ్విన్‌ భార్య భావోద్వేగ పోస్టు.. ఇంతకీ అసలేంటంటే.?

Prithi Narayanan: టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ప్రపంచంలో 9వ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. అతని కంటే ముందు అనిల్ కుంబ్లే మాత్రమే భారత్ తరపున 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు జాక్ క్రౌలీని అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్నాయి. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన అశ్విన్ 98వ మ్యాచ్‌లో ఈ మార్కును చేరుకున్నాడు. ప్రపంచంలో మురళీధరన్ మాత్రమే అతని కంటే తక్కువ మ్యాచ్‌ల్లో 500 వికెట్లు సాధించాడు.

IND vs ENG: 500లు.. 501కి మధ్య 48 గంటలు: అశ్విన్‌ భార్య భావోద్వేగ పోస్టు.. ఇంతకీ అసలేంటంటే.?
R Ashwin Wife

Updated on: Feb 19, 2024 | 1:29 PM

Prithi Narayanan: భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు 500 టెస్టు వికెట్లు పూర్తి చేసిన అశ్విన్ అదే రోజు సాయంత్రం మ్యాచ్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ తన ఇంటికి తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ నాలుగో రోజు టీ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చాడు. టామ్ హార్ట్లీ వికెట్ కూడా తీశాడు. అయితే, భారత్ విజయం తర్వాత, అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.

500.. 501 మధ్య ఎన్నో జరిగాయి: ప్రీతి నారాయణన్

ప్రీతి నారాయణన్ అశ్విన్ 500వ వికెట్ నుంచి 501వ వికెట్ మధ్య సమయం తమ జీవితంలో సుదీర్ఘమైన 48 గంటలుగా అభివర్ణించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మేం హైదరాబాద్‌లో 500 వికెట్లు తీస్తాడని ఎదురుచూశాం. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత విశాఖపట్నంలోనూ ఫలితం దక్కలేదు. అయితే, 499వ వికెట్ తీసిన సమయంలోనే అప్పటికే కొని ఉంచిన స్వీట్లు అందరికీ పంచేశాం. రాజ్‌కోట్‌లో 500వ వికెట్ వచ్చి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. 500, 501వ వికెట్ మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో సుదీర్ఘమైన 48 గంటలు. అంటే, నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు అశ్విన్ ప్రదర్శన గురించి. ఇది ఎంతో అద్భుతమైన విజయం. అశ్విన్ అసాధారణమైన వ్యక్తి. నా భర్తను చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఎప్పటికీ మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’ అని భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.

500 వికెట్లు తీసిన 9వ బౌలర్‌గా రికార్డ్..

టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ప్రపంచంలో 9వ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. అతని కంటే ముందు అనిల్ కుంబ్లే మాత్రమే భారత్ తరపున 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు జాక్ క్రౌలీని అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్నాయి. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన అశ్విన్ 98వ మ్యాచ్‌లో ఈ మార్కును చేరుకున్నాడు. ప్రపంచంలో మురళీధరన్ మాత్రమే అతని కంటే తక్కువ మ్యాచ్‌ల్లో 500 వికెట్లు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..