రషీద్, వాట్సన్‌ల వివాదం: సోషల్ మీడియాలో జోకులే జోకులు

నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ రషీద్‌ ఖాన్‌ పూర్తిగా తేలిపోయాడు. ఎప్పుడూ లేనంత దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో […]

రషీద్, వాట్సన్‌ల వివాదం: సోషల్ మీడియాలో జోకులే జోకులు

Updated on: Apr 24, 2019 | 5:56 PM

నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ రషీద్‌ ఖాన్‌ పూర్తిగా తేలిపోయాడు. ఎప్పుడూ లేనంత దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన రషీద్‌ వాట్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదికి దూసుకెళ్లాడు. రషీద్ చేసిన ఈ చర్యకు వాట్సన్‌ ధీటుగా తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో బదులిచ్చాడు. కాగా వీరిద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుండగా అభిమానులు మాత్రం ఫన్నీమీమ్స్‌, కామెంట్స్‌తో జోకులు పేల్చుతున్నారు.

మరోవైపు మ్యాచ్ అనంతరం మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ షేన్ వాట్సన్.. చెన్నై జట్టు కోచ్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోనిలకు ధన్యవాదాలు తెలిపాడు. నేను చాలా జట్లకు ఆడాను. ప్రస్తుతం నేను ఉన్న ఫామ్ ను చూసుకుంటే ఏ జట్టు నాకు అవకాశం ఇవ్వదు. కానీ ఫ్లెమింగ్‌,ధోని నాపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చారు.’ అని వాట్సన్ పేర్కొన్నాడు.