SA Vs AFG: 8 ప్రపంచకప్‌లు.. 6 ఓటములు.. కట్ చేస్తే.. తిరుగులేని జట్టులా ఫైనల్స్‌లోకి సఫారీలు ఎంట్రీ

|

Jun 27, 2024 | 12:38 PM

టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్‌కి చేరింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్‌కి చేరలేదు. సెమీఫైనల్లో ఓడే తమ సాంప్రదాయానికి చెక్ పెడుతూ ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో..

SA Vs AFG: 8 ప్రపంచకప్‌లు.. 6 ఓటములు.. కట్ చేస్తే.. తిరుగులేని జట్టులా ఫైనల్స్‌లోకి సఫారీలు ఎంట్రీ
South Africa Team
Follow us on

టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్‌కి చేరింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్‌కి చేరలేదు. సెమీఫైనల్లో ఓడే తమ సాంప్రదాయానికి చెక్ పెడుతూ ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. సెమీఫైనల్స్‌లో ఆప్ఘనిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

వరల్డ్ కప్ సెమీఫైనల్లో తొలిసారి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్, సూపర్ 8లో ఆస్ట్రేలియాలాంటి జట్లను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్..సెమీఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్ల ముందు నిలవలేకపోయింది. సఫారీ బౌలర్ల ధాటికి 56 పరుగులకే చాపచుట్టేశారు ఆఫ్ఘన్లు. అజ్మతుల్లా మినహా ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. ముగ్గురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరువలేదు. దీంతో 11.5 ఓవర్లలోనే 56 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఇదే అతితక్కువ స్కోర్‌ కాగా.. ఇక ఆఫ్ఘానిస్థాన్‌ జట్టుకు లోయెస్ట్‌ స్కోర్‌ కూడా ఇదే. మరోవైపు తమ ప్రత్యర్థిని అత్యంత తక్కువ స్కోరుకు కట్టడి చేసిన రికార్డును సౌతాఫ్రికా సాధించింది. గతంలో శ్రీలంకను దక్షిణాఫ్రికా 77 పరుగులకు ఆలౌట్ చేయగా, ఆ రికార్డును ఇవాళ సెమీఫైనల్‌లో బద్దలు కొట్టింది. మొత్తంగా టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్స్‌కు చేరింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..