క్రికెట్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం స్టేడియం వేదికగా ఈ మెగా క్రికెట్ సమరం షురూ కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గత మూడేళ్లుగా కొన్ని వేదికల్లోనే మ్యాచ్‌లు నిర్వహించింది బీసీసీఐ. అయితే ఈసారి ఆ పరిస్ధితి లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రౌండ్లలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు రెడీ అయ్యింది బీసీసీఐ. అలాగే కొవిడ్ భయంతో గత మూడేళ్లుగా కూడా ఆరంభ వేడుకలు రద్దవుతూ వచ్చాయి. అయితే ఈసారి ఆ లోటునంతా భర్తీ చేసిలా అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నాలతో లైవ్ పెర్ఫామెన్స్‌కు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్‌కు మరో ఇద్దరు స్టార్ హీరోలు సైతం రానున్నారని సమాచారం.
ఇటివల ఆస్కార్ అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ‘నాటు నాటు’ సాంగ్‌ను ఐపీఎల్ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని బీసీసీఐ నిర్ణయించుకుందట. అయితే ఈ పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని కూడా బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే పాన్ ఇండియా హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుందని బీసీసీఐకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. అన్నీ కుదిరితే అహ్మదాబాద్‌లో జరిగే ఆరంభ మ్యాచ్‌కు ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఉండొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..