PBKS vs RR, IPL 2021: మ్యాచ్ అంటే ఇదే.. హోరాహోరీ పోరు.. చివరి ఓవర్ చివరి బంతికి విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్

|

Sep 22, 2021 | 12:07 AM

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరిగిన మ్యాచులో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది.

PBKS vs RR, IPL 2021: మ్యాచ్ అంటే ఇదే.. హోరాహోరీ పోరు.. చివరి ఓవర్ చివరి బంతికి విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
Pkbs Vs Rr Ipl 2021
Follow us on

PBKS vs RR, IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరిగిన మ్యాచులో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో అయితే నువ్వానేనా అన్న తరహాలో సాగినా.. చివర్లో రాజస్థాన్ బౌలర్లు సత్తా చాటి రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. పంజాబ్ టీం విజయం సాధింస్తుందని అంతా అనుకున్నా చివరి ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. హోరాహోరీగా సాగిన మ్యాచులో రాజస్థాన్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి పంజాబ్ టీం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌‌లో ఆల్‌ రౌండ్ ప్రదర్శన చేసినా చివరి ఓవర్‌లో ఫలితం మారిపోవడంతో పంజాబ్‌ టీంకు ఓటమి తప్పలేదు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 4 పరుగులు కావల్సి ఉంది. ఫైనల్ ఓవర్‌ని వేసేందుకు కార్తీక్ త్యాగి రంగంలోకి దిగాడు. తొలి బంతికి మక్రాం పరుగులేమీ సాధించలేదు. రెండో బంతికి మక్రాం సింగిల్ తీశాడు. ఇక మూడో బంతికి పూరన్ ఔట్ కావడంతో మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. పంజాబ్ చేతిలో ఉన్న మ్యాచ్ కాస్త.. రాజస్థాన్ చేతిలోకి పోయింది. ఇంకో మూడు బంతులు మిగిలి ఉండగా.. పంజాబ్ విజయానికి మూడు పరుగులు కావల్సి ఉంది. నాలుగో బంతికి హుడా పరుగులేమి సాధించలేదు. ఇక ఐదో బంతికి మరో వికెట్ పడగొట్టిన కార్తీక్ రాజస్థాన్‌కు థ్రిల్లింగ్ విక్టరీకి చేరువచేశాడు. ఆరో బంతికి కూడా పరుగులేమీ రాకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. రాజస్థాన్ విజయానికి క్రెడిట్ అంతా చివరి ఓవర్ సంధించిన కార్తీక్ త్యాగికే వర్తిస్తుంది.

పంజాబ్ కింగ్స్‌ టీంలో ఓపెనర్లు రాహుల్ (49), మయాంక్ అగర్వాల్ (67) సెంచరీ భాగస్వామ్యం చేసి మ్యాచ్‌ను మంచి స్థితిలో ఉంచారు. మయాంక్ అగర్వాల్ కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ ఇద్దరూ వెంటవెంటనే పెవలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మక్రాం(26), పూరన్‌(32) అర్థ సెంచరీ భాగస్వామ్యంతో విజయం వరకు తీసుకొచ్చినా చివరి ఓవర్‌లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓడిపోయారు. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి 2 వికెట్లు, సకారియా, తివాటియా తలో వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులలకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో పంజాబ్ టీం ముందు 186 పరుగుల లక్ష్యం ఉంది.

ఇందులో జైస్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మహిపాల్ 43 పరుగులతో రెండవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహిపాల్ 252 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 17 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్లతో 43 పరుగులు బాదేశాడు.

లూయిస్ 36(7ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ 25 (2 ఫోర్లు, 1 సిక్స్)పరుగులతో రాణించారు. మిగతా వారు అంతగా రాణించలేదు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5, షమీ 3, ఇషాన్ పొరెల్, హార్‌ప్రీత్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: PBKS vs RR: ద్రవిడ్ శిష్యుడి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్‌ ఆగమాగం.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా రికార్డు

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

Yuvraj Singh: ఆరు బంతులకు ఆరు సిక్సులు.. ఆ అద్భత ఘట్టాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపిన యూవీ. వైరల్‌ వీడియో..