Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టు 112 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 172 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఆతిథ్య జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో RCB పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. 12 మ్యాచ్‌ల తర్వాత బెంగళూరు జట్టు 12 పాయింట్లు సాధించింది.
పవర్‌ప్లేలో సగం మంది పెవిలియన్‌కు..
172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు మంచి ప్రారంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయింది. జట్టులోని టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ 10 సంఖ్యను దాటలేకపోయారు. రాజస్థాన్ వరుస వికెట్లు కోల్పోయింది. జట్టు తరపున అతిపెద్ద భాగస్వామ్యం 19 పరుగులే కావడం గమనార్హం. ఇది అశ్విన్, షిమోరన్ హెట్మెయర్ జోడీ నెలకొల్పింది. రాజస్థాన్ తరపున షిమ్రాన్ హెట్మెయర్ (35 పరుగులు) టాప్ స్కోరర్. మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును దాటలేకపోయారు.
బెంగళూరు తరపున వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశాడు. మైఖేల్ బ్రేస్‌బెల్, కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు.
ఫాఫ్-గ్లెన్ అర్ధసెంచరీతో బెంగళూరు భారీ స్కోర్..
కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 55, గ్లెన్ మాక్స్‌వెల్ 54 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్‌లో అనూజ్ రావత్ 10 బంతుల్లో 25 పరుగులు చేయడంతో బెంగళూరు జట్టు 171 పరగులు చేసింది.
ఆడమ్ జంపా, కేఎం ఆసిఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇరుజట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ,కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..