Riyan Parag: మరోసారి ట్రోల్స్ బారిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్.. ఓ మోడల్ ట్వీట్ లైక్ చేయడంతో హర్టయిన ఫ్యాన్స్..

|

Aug 23, 2022 | 1:54 PM

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన రియాన్ పరాగ్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఓ మోడల్ ట్వీట్‌ను లైక్ చేయడంతో ట్రోల్ చేస్తున్నారు.

Riyan Parag: మరోసారి ట్రోల్స్ బారిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్.. ఓ మోడల్ ట్వీట్ లైక్ చేయడంతో హర్టయిన ఫ్యాన్స్..
Rajasthan Royals Riyan Parag
Follow us on

రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ తరచూ వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ 20 ఏళ్ల ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో ప్రసిద్ది చెందాడు. కానీ, మైదానం వెలుపల, అతను వివాదానికి కారణమయ్యే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి వివాదంతో రియాన్ పరాగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ మోడల్ ట్వీట్‌ను రియాన్ పరాగ్ ఇష్టపడడంతో అభిమానులు అతనిని ట్రోల్ చేస్తున్నారు. మోడల్ ట్వీట్‌ను లైక్ చేయడంలో తప్పు లేదు. కానీ, పరాగ్ ట్రోల్ చేయడం వెనుక కారణం వేరే ఉంది.

ట్రోల్స్ బారిన రియాన్ పరాగ్..

జాన్వీ శర్మ అనే మోడల్ సోమవారం అర్థరాత్రి 12.29 గంటలకు ఒక ట్వీట్ చేసింది. ఇందులో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. రియాన్ పరాగ్ ఆట్వీట్‌ను ఇష్టపడ్డాడు. దీని తర్వాత అభిమానులు ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

IPL 2022 సమయంలోనూ..

IPL 2022లో కూడా రియాన్ పరాగ్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ మధ్య వాగ్వాదం జరిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఈ వివాదం మొదలైంది. ఈ మ్యాచ్‌లో హర్షల్‌పై పరాగ్ ధీటుగా బ్యాటింగ్ చేశాడు.

2021లో ముంబైలో ఆర్‌సీబీతో ఆడుతున్నప్పుడు హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ పెవిలియన్ చేరాడు. పరాగ్ ఔట్ అయ్యాక పెవిలియన్‌కి వెళుతుండగా, హర్షల్ పటేల్ తన చేతితో అతనికి సైగ చేశాడు. రియాన్ పరాగ్ హోటల్‌కి వెళ్లి ఈ ఫుటేజీని చూశాడు. ఆ విషయం అతని మనస్సులో ఉండిపోయింది. దీని తర్వాత 2022లో, పరాగ్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చితక్కొట్టి, అర్ధ సెంచరీ చేసిన తర్వాత, ఈ ఆటగాడు హర్షల్ పటేల్‌ను ఉద్దేశిస్తూ ఓ సైగ చేశాడు. దీంతో ట్రోల్స్ బారిన పడ్డాడు.