AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!

Ramraj Meena Heart Attack: దౌసాలో క్రికెట్ ఆడుతూ 25 ఏళ్ల రాంరాజ్ మీనా గుండెపోటుతో మరణించాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదు నెలల క్రితమే వివాహం చేసుకున్న రాంరాజ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Video: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.. ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
Ramraj Meena Heart Attack
Venkata Chari
|

Updated on: Sep 23, 2026 | 11:04 AM

Share

Suspected Heart Attack Cricket: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సంలేటి గ్రామంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో 25 ఏళ్ల రాంరాజ్ మీనా అనే యువకుడు అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఆటను ఉత్సాహంగా ఆస్వాదిస్తున్న రాంరాజ్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

సంలేటి గ్రామానికి చెందిన రాంరాజ్ మీనా, క్రికెట్ మ్యాచ్‌లో తన జట్టుకు నాయకత్వం వహించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేయగా, రాంరాజ్ తన జట్టు కోసం బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. బౌలింగ్ ప్రారంభించి కొద్దిసేపటికే అతడు ఛాతీలో తీవ్ర నొప్పిని అనుభవించాడు. నొప్పితో విలవిల్లాడిన రాంరాజ్ ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో మైదానంలో ఉన్న స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివనది: Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

వెంటనే స్పందించిన స్నేహితులు అతడిని సమీపంలోని మహ్వా ఆస్పత్రికి తరలించారు. మహ్వా ఆస్పత్రిలో వైద్యులు రాంరాజ్‌కు ప్రథమ చికిత్స అందించినప్పటికీ, మెరుగైన వైద్యం కోసం అతడిని జైపూర్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు రాంరాజ్‌ను వెంటనే జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి, రాంరాజ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై మహ్వా పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో రాంరాజ్ గుండెపోటు కారణంగానే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మృతికి సంబంధించిన పూర్తి కారణాలపై అధికారిక నిర్ధారణ కోసం వైద్యపరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

ఎక్కువమంది చదివనది: 5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర!

రాంరాజ్ మీనా వ్యక్తిగత వివరాల ప్రకారం, అతడికి కేవలం ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. అంతేకాకుండా, రాంరాజ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలలు కంటున్న యువకుడి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రాంరాజ్ తన స్నేహితులతో కలిసి టాస్ వేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. టాస్ వేసిన కొద్దిసేపటికే యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా ప్రజలను తీవ్రంగా కలచివేసి, విషాద వాతావరణాన్ని నింపింది. ఈ సంఘటన యువతలో గుండె సంబంధిత సమస్యల పట్ల అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us