Radha Yadav : ఓర్నాయనో.. లేడీ కాదు శివంగి.. చిరుతలా ఎగిరి క్యాచ్ పట్టేసింది.. షాకింగ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి T20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, భారత ప్లేయర్ రాధా యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్‌లో కొన్నిసార్లు అద్భుతమైన ఫీల్డింగ్ జట్టును గెలిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, రాధా యాదవ్ అద్భుతమైన క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది.

Radha Yadav : బర్మింగ్‌హామ్‌లో జూలై 12న జరిగిన ఐదవ T20 మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు, ఇంగ్లాండ్ మహిళా జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చివరి బంతికి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ ప్లేయర్ రాధా యాదవ్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. 25 ఏళ్ల యువ క్రికెటర్ గాల్లోకి ఎగిరి దాదాపు అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకుంది. ఈ అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్యాచ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో జరిగింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి మిగిలిన నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేయాల్సి ఉంది. అమీ జోన్స్ క్రీజ్‌లో ఉంది. అరుంధతి రెడ్డి వేసిన ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని అమీ జోన్స్ గాల్లోకి కొట్టింది. ఆ షాట్ బౌండరీని దాటడానికి ఎనర్జీ సరిపోలేదు. డీప్ మిడ్-వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాధా యాదవ్ ముందుకు పరిగెత్తి, గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకుంది.
ఆ క్యాచ్ పట్టుకోవడానికి ఆమె కొంత దూరం పరిగెత్తాల్సి వచ్చింది. బంతి కింద పడబోతోందని గ్రహించిన రాధా గాల్లోకి దూకింది. సరైన సమయంలో డైవ్ చేసి ఆమె బంతిని అందుకోగలిగింది. కింద పడినప్పటికీ ఆమె బంతిని చేజార్చుకోకుండా విజయవంతంగా క్యాచ్ పట్టేసుకుంది.ఈ మ్యాచ్‌లో రాధా యాదవ్ తన బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీసింది. ఆమె ఎకానమీ రేట్ 5.00 మాత్రమే. బ్యాటింగ్‌లో కూడా ఆమె 14 పరుగులు చేసింది.
New Superwoman movie is out in theatres now ✈️🤯
Rate this Radha Yadav stunner!
(via SonyLiv) | #ENGvINDpic.twitter.com/meLtjSNPQq
— Women’s CricZone (@WomensCricZone) July 13, 2025
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. షఫాలీ వర్మ అద్భుతంగా 75 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కోల్పోయింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




