AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anderson Phillip : వీడు ఫీల్డర్ కాదు మామ సూపర్ మ్యాన్.. గాల్లో బంతిని పట్టిన విధానం చూస్తే షాకే

వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆండర్సన్ ఫిలిప్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఇంత అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడం చాలా అరుదు.

Anderson Phillip : వీడు ఫీల్డర్ కాదు మామ సూపర్ మ్యాన్.. గాల్లో బంతిని పట్టిన విధానం చూస్తే షాకే
Anderson Phillip
Rakesh
|

Updated on: Jul 13, 2025 | 4:15 PM

Share

Anderson Phillip : వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఆండర్సన్ ఫిలిప్ ఒక అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‎ను అవుట్ చేయడానికి తను పట్టిన ఈ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆండర్సన్ మైదానంలో సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‎గా వచ్చాడు. తాను ఇంత గొప్ప క్యాచ్ పడతాడని బహుశా తనకు కూడా తెలియకపోవచ్చు. ఈ ఘటన 65వ ఓవర్‌లోని చివరి బంతికి జరిగింది. జస్టిన్ గ్రీవ్స్ ఆఫ్ స్టంప్ వెలుపల వేసిన ఫుల్ బంతిని హెడ్ గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, మిడాఫ్ నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆండర్సన్ గాల్లోకి డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామార్ జోసెఫ్ అదరగొట్టాడు. జోసెఫ్ వెస్టిండీస్ తరపున అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. దీనివల్ల ఆస్ట్రేలియా జట్టు కేవలం 225 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 46 పరుగులు, ట్రావిస్ హెడ్ 20, ఉస్మాన్ ఖవాజా 23, అలెక్స్ కేరీ 21 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు మంచి ఆరంభం లభించినా, దానిని పెద్ద స్కోరుగా మార్చలేకపోయారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి, వెస్టిండీస్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. వెస్టిండీస్‌కు మొదటి వికెట్ మిచెల్ స్టార్క్ తీశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..