అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఈరోజు ఉంటది.. ఇంగ్లాండ్‌కు అశ్విన్ గట్టి వార్నింగ్!

Ravichandran Ashwin Comments on Vaibhav Sooryavanshi: భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో, తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే ట్రైలర్ చూపించిన వైభవ్ సూర్యవంశీ, ఈ నిర్ణయాత్మక పోరులో ఎలాంటి సునామీ ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు, ప్రత్యర్థి ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి సినిమా చూపించబోతున్నాడు అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఈరోజు ఉంటది.. ఇంగ్లాండ్‌కు అశ్విన్ గట్టి వార్నింగ్!
Ravichandran Ashwin Comments On Vaibhav Sooryavanshi

Updated on: Jul 07, 2026 | 12:55 PM

Ravichandran Ashwin Comments on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ప్రత్యర్థి జట్టును హెచ్చరించాడు. ఎలాంటి భయం లేకుండా ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొన్న తీరు అద్భుతమని అశ్విన్ కొనియాడాడు.

భయం ఎరుగని బ్యాటింగ్‌తో భారతఅరంగేట్రం..

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల ప్రాయంలోనే భారత జాతీయ జట్టు జర్సీని ధరించి మైదానంలోకి అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లాండ్ జట్టులోని అత్యంత వేగవంతమైన పేస్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి దిగ్గజాలను సైతం లెక్కచేయకుండా భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తను ఎదుర్కొన్న కేవలం 10 బంతుల్లోనే రెండు కళ్ళు చెదిరే సిక్సర్లు బాది తనలోని దూకుడును ప్రపంచానికి చాటిచెప్పాడు.

ఇది కూడా చదవండి: Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

ఇవి కూడా చదవండి

అది కేవలం చిన్న ట్రైలర్ మాత్రమే.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ భయం లేని బ్యాటింగ్ శైలిని రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు. అంతర్జాతీయ వేదికపై ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొని వైభవ్ కొట్టిన సిక్సర్లు కేవలం ఒక నమూనా మాత్రమేనని అశ్విన్ వ్యాఖ్యానించాడు. “అంతర్జాతీయ వేదికపై ఎలాంటి బెరుకు లేకుండా ఆడటం నాకు బాగా నచ్చింది. వైభవ్ ముఖంలో ఏమాత్రం భయం గానీ, ఒత్తిడి గానీ కనిపించలేదు. అతడు కేవలం వేగంగా ఆడేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. తన బ్యాటింగ్ శైలితో తను ఏంటో తొలి మ్యాచ్‌లోనే నిరూపించుకున్నాడు” అని అశ్విన్ పేర్కొన్నాడు. వైభవ్‌లో సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడే నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: IND vs ENG: అగ్నిపరీక్షకు సిద్ధమైన కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

ఎవరితోనూ పోల్చవద్దు.. అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వండి..

ఈ సందర్భంగా అశ్విన్ ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులకు, విశ్లేషకులకు సూచించాడు. ఈ కుర్రాడు ఇప్పుడిప్పుడే తన అంతర్జాతీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడని, కాబట్టి అతడిని ఇప్పుడే ఇతర దిగ్గజ ఆటగాళ్లతో పోల్చి ఒత్తిడికి గురి చేయవద్దని కోరాడు. “వైభవ్‌కు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అతడు తన సుదీర్ఘమైన కెరీర్‌ను ఎలా మలుచుకుంటాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి అతడిని వైభవ్ సూర్యవంశీలానే ఉండనివ్వండి. ఎవరితోనూ పోలికలు వద్దు” అని అశ్విన్ హితవు పలికాడు. ఐపీఎల్ 2026 సీజన్‌తో పాటు ఇటీవల ఇండియా ఏ జట్టు తరపున పరుగుల వరద పారించి జాతీయ జట్టులోకి వచ్చిన ఈ కుర్రాడు భవిష్యత్ ఆశాకిరణమని స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us