
Punjab Kings vs Mumbai Indians, Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మోటెరా మెట్రో స్టేషన్ బయట గందరగోళం నెలకొంది. ముంబై ఇండియన్స్ జెర్సీలను అక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో అభిమానులు జెర్సీల కోసం పరుగెత్తారు. అభిమానుల సంఖ్య పెరుగుతున్నందున, స్టేడియంలోని గేట్ నంబర్ 1 బయట ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఆర్‌సీబీ జట్టు ఇప్పటికే క్వాలిఫయర్-1 గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ద్వారా ముంబై క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది.
ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తొలిసారి తలపడనున్నాయి. అదే సమయంలో ఇరుజట్లు ఈ సీజన్‌లో రెండోసారి తలపడనున్నారు. గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించింది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..