PBKS vs SRH, IPL 2024: ‘పంజా’ విసిరిన హైదరాబాద్.. థ్రిల్లింగ్ పోరులో 2 పరుగుల తేడాతో గెలుపు

|

Apr 09, 2024 | 11:33 PM

Punjab Kings vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్ ను వారి సొంత గడ్డపై ఓడించింది. మంగళవారం (ఏప్రిల్ 09) రాత్రి ముల్లన్ పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది

PBKS vs SRH, IPL 2024: పంజా విసిరిన హైదరాబాద్.. థ్రిల్లింగ్ పోరులో 2 పరుగుల తేడాతో గెలుపు
Sunrisers Hyderabad
Follow us on

Punjab Kings vs Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్ ను వారి సొంత గడ్డపై ఓడించింది. మంగళవారం (ఏప్రిల్ 09) రాత్రి ముల్లన్ పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ జట్టులో నితీష్ రెడ్డి అత్యధికంగా 64 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఇచ్చిన 183 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ తడబడింది. కీలక బ్యాటర్లు త్వరగా ఔటవడంతో జట్టుపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. బంతులు, పరుగుల మధ్య అంతరాన్ని తగ్గించడం కష్టంగా మారింది. దీంతో చివరికి హైదరాబాద్ మ్యాచ్‌లో పట్టు సాధించింది. దీంతో చివరకు ధావన్‌ సేన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరులో శశాంక్‌ సింగ్‌ (46 నాటౌట్), అశుతోష్‌ శర్మ (33 నాటౌట్ ) భయపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. సామ్‌ కరన్‌ (29), సికిందర్‌ రజా (28) పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 2 వికెట్లు తీయగా, కమిన్స్‌, నటరాజన్‌, ఉనద్కత్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 

ఇవి కూడా చదవండి

లక్ష్య ఛేదనల పంజాబ్ కు శుభారంభం లభించలేదు. జానీ బెయిర్‌స్టో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ప్రభాసిమ్రాన్ సింగ్‌ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో వికెట్ ను అందించాడు.శిఖర్ ధావన్ 16 బంతుల్లో 14 పరుగుల వద్ద ఔటయ్యాడు.సామ్ కరణ్ 22 బంతుల్లో 29 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. సికందర్ రాజా కూడా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. 28 పరుగుల దగ్గర ఔటయ్యాడు. జితేష్ శర్మ 19 రన్స్ చేసి పెవిలయిన్ బాట పట్టాడు.

రెండు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభాసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్