PBKS vs GT, IPL 2024: తేవాటియా ధనాధన్ బ్యాటింగ్.. పంజాబ్ పై గుజరాత్ విజయం

Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ గెలిచి లెక్క సరిచేసింది.

PBKS vs GT, IPL 2024: తేవాటియా ధనాధన్ బ్యాటింగ్.. పంజాబ్ పై గుజరాత్ విజయం
Gujarat Titans

Updated on: Apr 22, 2024 | 12:02 AM

Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్ గెలిచి లెక్క సరిచేసింది. సాధారణంగా ఈ సీజన్ లో టాస్ గెలిచిన తర్వాత, అందరూ ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. అయితే సామ్ కరణ్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని పంజాబ్ బ్యాటర్లు వమ్ము చేశారు. గుజరాత్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు ఆడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. అయితే సునాయసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ కూడా తంటాలు పడింది. పంజాబ్ బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంతో గుజరాత్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది.
రాహుల్‌ తెవాతియా ( 18 బంతుల్లో36 నాటౌట్ 7 ఫోర్లు) చెలరేగి ఆడాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌( 29 బంతుల్లో35, 5 ఫోర్లు), సాయి సుదర్శన్‌ ( 34 బంతుల్లో 31, 3 ఫోర్లు) నిలకడగా ఆడారు. వృద్ధిమాన్ సాహా(13), మిల్లర్‌ (4), ఒమర్జాయ్‌ (13), షారుఖ్‌ ఖాన్‌(8), రషీద్‌ ఖాన్‌ (3) తీవ్ర నిరాశపరిచారు. పంజాబ్‌ కింగ్స్ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీయగా, లివింగ్‌ స్టోన్‌ 2, అర్ష్‌దీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానానికి ఎగబాకింది. నిజానికి పంజాబ్ ఇచ్చిన టార్గెట్ ను గుజరాత్ తక్కువ ఓవర్లలో పూర్తి చేసి ఉంటే పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకి ఉండేది. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో నెట్ రన్ రేట్ లో స్వల్ప తేడా వచ్చింది. దీంతో ఆరోస్థానానికే పరిమితమైంది. మరోవైపు ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఇవి కూడా చదవండి

అంతకుముందు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ సామ్ కరణ్, ప్రభాసిమ్రాన్ సింగ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత ఆ జట్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 47 పరుగుల వ్యవధిలో 7 వికెట్ల కోల్పోవడంతో కష్టాల్లో పడింది. హర్‌ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 140 పరుగులకు చేర్చారు. గుజరాత్ తరఫున సాయి కిషోర్ 4, నూర్ అహ్మద్ 2, మోహిత్ శర్మ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

రెండు జట్ల XI ప్లేయింగ్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

సామ్ కుర్రాన్ (కెప్టెన్), ప్రభాసిమ్రాన్ సింగ్, రిలే రోసో, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

 

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, అథర్వ తైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, శివమ్ సింగ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సాయి సుదర్శన్, శరత్ BR, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి