PBKS vs SRH IPL Match Result: సమిష్టిగా రాణించిన హైదరాబాద్ ప్లేయర్స్.. పంజాబ్‌పై ఘన విజయం..

PBKS vs SRH IPL Match Result: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయాన్ని అందుకుంది. పంజాబ్‌ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ సునాయాసంగా చేధించారు...

PBKS vs SRH IPL Match Result: సమిష్టిగా రాణించిన హైదరాబాద్ ప్లేయర్స్.. పంజాబ్‌పై ఘన విజయం..
Srh Won The Match
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 17, 2022 | 7:47 PM

PBKS vs SRH IPL Match Result: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయాన్ని అందుకుంది. పంజాబ్‌ ఇచ్చిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ సునాయాసంగా చేధించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో హైదరాబాద్‌ తన ఖాతాలో వరుసగా నాలుగో విజయాన్ని వేసుకుంది. మ్యాచ్‌లో చివర్లో ఐడెన్‌ మార్క్రామ్‌, పూరన్‌ భారీ షాట్స్‌తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించారు. హైదరాబాద్‌ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐడెన్‌ మార్క్రామ్‌ (41), నికోలస్‌ పూరన్‌ (35) పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇక అంతకుముందు రాహుల్‌ త్రిపాఠి (34), అభిషేక్‌ శర్మ (31) పరుగులు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇక పంజాబ్‌ బౌలింగ్ విషయానికొస్తే రాహుల్‌ చాహర్‌ 4 ఓవర్లకుగాను 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రబడా ఒక వికెట్‌ తీసుకున్నాడు. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన పంజాబ్‌ అలవుట్‌ అయ్యింది. దీంతో మొన్నటి వరకు పాయింట్ల జాబితాలో 7వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ 4 స్థానంలోకి చేరింది.

Also Read: Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..

Mango Special: పండ్లకు రారాజు.. మామిడి పండు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏయే రకాలు లభిస్తాయో తెలుసా..

Economic crises: భారత్ చుట్టూ ముదురుతున్న సంక్షోభం.. ఇవి మన దేశంపై ప్రభావం చూపుతాయా..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో