CSK vs GT Highlights: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం.. రాణించిన డెవిడ్ మిల్లర్..
IPL 2022: ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య జరుగిన మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది.
ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య జరుగిన మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి169 పరుగులు చేసింది. డెవిడ్ మిల్లర్ భారీ స్కోరుతో గుజరాత్ విజయం సాధించింది. మిల్లర్ 51 బంతుల్లో 94 పరుగులు చేశాడు.
Key Events
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ బౌలర్ మహేష్ తీక్షన అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతడిపై చెన్నై ఆశలు పెట్టుకుంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారీ స్కోర్లు సాధిస్తూ జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. అటు బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాలని చూస్తున్నాడు.
LIVE Cricket Score & Updates
-
గుజరాత్ విజయం
చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
-
ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఏడో వికెట్ కోల్పోయింది. జోసెఫ్ డౌకౌట్ అయ్యాడు.
-
-
ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 20 బంతుల్లో 40 పరుగులు చేసిన రషీద్ ఖాన్ బ్రవో బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన తెవటియా బ్రవో బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు
-
హాఫ్ సెంచరీ చేసిన డెవిడ్ మిల్లర్
గుజరాత్ ఆటగాడు డెవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
-
-
వృద్ధిమాన్ సహా ఔట్
గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్ధిమాన్ సహా జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అభినవ్ మనోహర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్ ఔటయ్యాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్‌గిల్ డౌకౌట్ అయ్యాడు.
-
169 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 73 పరుగులు, రాయుడు 46 పరుగులు చేశాడు.
-
రుతురాజ్ గైక్వాడ్ ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 73 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ యశ్ దయల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది.
-
హాఫ్ సెంచరీ చేసిన గైక్వాడ్
గత మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
-
మొయిన్ అలీ ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. జోసెఫ్ బౌలింగ్‌లో ఒక పరుగు చేసిన మొయిన్ అలీ పెవిలియన్ చేరాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన రాబిన్ ఉతప్ప షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
-
గుజరాత్ ఐదో విజయం సాధిస్తుందా?
గుజరాత్ టైటాన్స్ తొలిసారిగా ఐపీఎల్ ఆడుతోంది. ఈ జట్టు మొదటి సీజన్‌లోనే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Published On - Apr 17,2022 6:59 PM