IPL 2022: రాణించిన రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు.. 169 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్..
CSK vs GT: ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి169 పరుగులు చేసింది...
CSK vs GT: ఐపీఎల్ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి169 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు మూడో ఓవర్‌లోనే మొదటి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాబిన్ ఉతప్ప మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ జోసెఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టును రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు అదుకున్నారు. గత ఐదు మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో 31 బంతుల్లో 46(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసిన జోసెఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దాటిగా ఆడే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. 48 బంతుల్లో 73(5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు చేసిన గైక్వాడ్ యశ్ దుల్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, దయల్ ఒక్కో వికెట్ తీశారు.
Read Also.. R Madhavan: పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. స్విమ్మింగ్‌లో సిల్వర్ గెలుచుకున్న కొడుకు.. శుభాకాంక్షలు వెల్లువ