AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ను వరించిన విజయం.. ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించిన డెవిడ్‌ మిల్లర్..

CSK vs GT: ఐపీఎల్‌ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్‌ టైటాన్స్‌(GT) మధ్య జరుగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది...

IPL 2022: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ను వరించిన విజయం.. ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించిన డెవిడ్‌ మిల్లర్..
Millar
Srinivas Chekkilla
|

Updated on: Apr 18, 2022 | 12:00 AM

Share

ఐపీఎల్‌ 2022(IPL)లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్(CSK), గుజరాత్‌ టైటాన్స్‌(GT) మధ్య జరుగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఉత్కంఠ పోరులో డెవిడ్‌ మిల్లర్ క్లాస్‌ ఇన్సింగ్స్‌తో టైటాన్స్‌ విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి169 పరుగులు చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మూడో ఓవర్‌లోనే మొదటి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాబిన్ ఉతప్ప మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ జోసెఫ్‌ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టును రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు అదుకున్నారు. గత ఐదు మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో 31 బంతుల్లో 46(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేసిన జోసెఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దాటిగా ఆడే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్‌ ఔటయ్యాడు. 48 బంతుల్లో 73(5 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు చేసిన గైక్వాడ్ యశ్‌ దుల్‌ బౌలింగ్‌లో అభినవ్‌ మనోహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గుజరాత్‌ బౌలర్లలో జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, దయల్‌ ఒక్కో వికెట్ తీశారు.

170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోని వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ శుభమన్‌గిల్‌ డౌకౌట్‌ అయ్యాడు. ఆ వెంటనే ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన విజయ్ శంకర్‌ కూడా పెవిలియన్ చేరాడు. డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ 12 పరుగులు చేసి మహేష్ తీక్షన బౌలింగ్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. డెవిడ్ మిల్లర్, సహా కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 11 పరుగులు చేసిన సహా జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 87 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయిన జట్టను మిల్లర్, తాత్కలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రషీద్‌ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 20 బంతుల్లో 40(2 ఫోర్లు, 3 సిక్స్‌లు)పరుగులు చేసిన రషీద్‌ ఖాన్‌ ఔటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన జోసెఫ్‌ను బ్రవో పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో గుజరాత్‌కు 6 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో మిల్లర్, ఫర్గిసన్‌ ఉన్నారు. క్రిస్ జోర్డాన్‌ బౌలంగ్‌కు వచ్చాడు. మొదటి బంతి ఒక్క పరుగు కూడా రాలేదు. రెండో బంతికి కూడా పరుగు రాలేదు. దీంతో 4 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే మిల్లర్‌ మూడో బంతిని సిక్స్‌గా మాలిచాడు. నాలుగో బంతికి క్యాచ్‌ ఔట్ అయ్యాడు. అయితే ఆ బంతి లెన్త్‌ నోబ్‌గా ఎంపైర్‌ ప్రకటించాడు. దీంతో మూడు బంతుల్లో 6 పరుగులు కావాలి. మిల్లరు నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీయడంతో గుజరాత్ విజయం సాధించింది. మిల్లర్‌ 51 బంతుల్లో 94(8 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫర్గిసన్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్నాడు. చెన్నై బౌలర్లలో బ్రవో మూడు వికెట్ల తీయగా.. మహేష్ తీక్షన 2, జడేజా, చౌదరి ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read Also.. PBKS vs SRH IPL Match Result: సమిష్టిగా రాణించిన హైదరాబాద్ ప్లేయర్స్.. పంజాబ్‌పై ఘన విజయం..