4,4,4,4,4,4.. రెడ్‌బుల్‌ ఏసొచ్చి రంకెలేశాడు.. 20 ఫోర్లు, 5 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ఎవరంటే.?

ఈ ప్లేయర్‌ను ఐపీఎల్ వద్దంది.. మిగిలిన ఫ్రాంచైజీ లీగ్‌లు మాత్రం ముద్దని అక్కున చేర్చుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ అవకాశాలు రాకపోయినా.. టీ20లలో రెడ్ బుల్ తాగి మరీ రచ్చ చేస్తున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా మరి.?

4,4,4,4,4,4.. రెడ్‌బుల్‌ ఏసొచ్చి రంకెలేశాడు.. 20 ఫోర్లు, 5 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. ఎవరంటే.?
Psl 2025

Updated on: Apr 19, 2025 | 4:50 PM

పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ పరుగుల వరద పారిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన ఈ క్రికెటర్.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అబుదాబీ, బంగ్లాదేశ్ టీ20 లీగ్‌లలో ఆడుతోన్న విన్స్.. పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం పీఎస్‌ఎల్ టోర్నీ జరుగుతోంది. ఇందులో కరాచీ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకదానిలో ఓడిపోయి.. రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక ఈ రెండు విజయాల్లోనూ జేమ్స్ విన్స్ కీలక పాత్ర పోషించాడు.

ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ విన్స్ కిర్రాక్ సెంచరీ(101)తో అదరగొట్టగా.. క్వాట్టా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో 70 పరుగులతో రాణించాడు. ఇక అత్యధిక రన్‌స్కోరర్‌లో రెండో స్థానంలో నిలిచాడు జేమ్స్ విన్స్.. మొత్తంగా 3 మ్యాచ్‌లలో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 171 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో జేమ్స్ విన్స్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం జేమ్స్ విన్స్ తన సత్తా చాటుతున్నాడు. వరుసగా అద్భుత పెర్ఫార్మన్స్‌లు చేస్తూ.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది జేమ్స్ విన్స్‌ను కరాచీ కింగ్స్ 1,04,866 డాలర్లకు కొనుగోలు చేసింది.