Video: రిటర్న్ క్యాచ్ అద్భుతంగా పట్టి.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సైగలు.. సీన కట్‌చేస్తే..
Kieron Pollard: ఈ మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ తన టీ20 కెరీర్‌లో 800వ సిక్సర్ కొట్టాడు. అయితే అతను క్యాచ్ తీసుకున్న తర్వాత క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడు.
PSL 2023: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్, వెటరన్ ఆల్ రౌండర్‌కు శనివారం చేదు-తీపి అనుభవాలు ఎదురయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న పొలార్డ్.. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. పొలార్డ్ వేగంగా స్కోర్ చేశాడు. తన కెరీర్‌లో రికార్డ్ 800వ సిక్స్ కొట్టాడు. అలాగే ఆ తర్వాత బౌలింగ్‌లో తన స్వంత బంతికి అద్బుతంగా రిటన్ క్యాచ్ తీసుకున్నాడు. ఇదంతా పొలార్డ్‌కి బాగా కలిసొచ్చింది. కానీ, అతని జట్టు ఓడిపోయింది.
లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఖలందర్స్ 180 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 35 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టును బలమైన స్కోరుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. 13వ ఓవర్‌లో షఫీక్‌ను కైరన్ పొలార్డ్ అవుట్ చేయడంతో పొలార్డ్‌కు ఈ వికెట్ దక్కింది.
క్యాచ్‌తో చిక్కుల్లో పొలార్డ్..
13వ ఓవర్ నాలుగో బంతికి అబ్దుల్లా పొలార్డ్ వైపు భారీ షాట్ ఆడాడు. రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో పొలార్డ్ ఎలాంటి పొరపాటు చేయకుండా వేగంగా రెండు చేతులతో అందుకున్నాడు. ఇంత వరకు అంతా సరిగ్గానే ఉంది. కానీ, ఆ తర్వాత పొలార్డ్ చేసిన పని బాగోలేదు. షఫీక్ చాలా వేగంగా పరుగులు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో అతని వికెట్ అవసరం. పొలార్డ్ ఆ విజయాన్ని అందించాడు. కానీ, ఆ తర్వాత అతను వెనక్కి వెళ్లమని షఫీక్ వైపు వేళ్లు చూపిస్తూ.. సైగలు చేశాడు.
రూల్స్ ఉల్లంఘన..
Kieron Pollard giving Abdullah Shafique directions ↗️
(via @thePSLt20) | #LQvMSpic.twitter.com/9MbfIqkG6e
— ESPNcricinfo (@ESPNcricinfo) March 4, 2023
పొలార్డ్ ఈ క్యాచ్, ఆ తర్వాత అతను చేసిన సంజ్ఞల వీడియో వైరల్ అయ్యింది. అందరి దృష్టి పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌పై కాకుండా.. అతని హావభావాలపై పడ్డాయి. ఆట స్ఫూర్తికి విరుద్ధంగా పరిగణిస్తున్నారు. PSL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనిని దోషిగా గుర్తించి, మందలించారు. అయితే, పొలార్డ్‌కు జరిమానా విధించకపోవడం ఉపశమనం కలిగించే అంశం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..