AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Cricket: WPLలో ఈ నియమం.. IPLలో అమలైతే.. ధోని మైదానంలోకి వచ్చే వాడే కాదు..

No Ball and Wide DRS: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ నో బాల్‌పై సమీక్ష తీసుకున్నా.. అంపైర్ నిర్ణయం సరైనదని రివ్యూలో తేలింది. ఐపీఎల్‌లో ఈ నిబంధన ఎలా విప్లవాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు చూద్దాం..

T20 Cricket: WPLలో ఈ నియమం.. IPLలో అమలైతే.. ధోని మైదానంలోకి వచ్చే వాడే కాదు..
Dhoni No Ball Video
Venkata Chari
|

Updated on: Mar 05, 2023 | 8:23 PM

Share

WPL 2023 ప్రారంభమైన వెంటనే ప్రపంచ క్రికెట్‌లో నూతనోత్సాహం మొదలైంది. ఈ లీగ్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో పాటు, ఒక నియమం కూడా చాలా సందడి చేస్తోంది. వైడ్‌తో పాటు నో బాల్‌కు కూడా కెప్టెన్‌ రివ్యూ తీసుకోవాలనే నిబంధన గురించి చర్చ జరుగుతోంది. DRS కింద వికెట్ కాకుండా నో బాల్, వైడ్ బాల్‌పై అప్పీల్ చేయవచ్చు. ఇప్పటి వరకు WPL రెండు మ్యాచ్‌లలో ఈ నియమం ఉపయోగించారు. శనివారం, హర్మన్‌ప్రీత్ కౌర్ వైడ్ బాల్ ఇవ్వడానికి వ్యతిరేకంగా DRS తీసుకుంది. ఆ తర్వాత అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో నో బాల్‌కు సంబంధించి సమీక్ష కూడా తీసుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో, ఫుల్ టాస్‌కు నో బాల్ ఇవ్వకుండా జెమిమా రోడ్రిగ్స్ రివ్యూ తీసుకుంది. అయితే ఆమె రివ్యూ ఫలించలేదు. అయితే ఎక్కడో ఒకచోట ఈ నిబంధన ప్రపంచ క్రికెట్‌లో విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలదని భావిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌కు ముందు ఐపీఎల్‌లో కూడా ఈ నిబంధనను అమలు చేయవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో నో బాల్ విషయంలో పెద్ద దుమారం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నో బాల్‌కు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. ఇందులో ఎంఎస్ ధోనీ కూడా వివాదంలో చిక్కుకున్నాడు. 2019లో రాజస్థాన్‌-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నో బాల్‌ నిర్ణయాన్ని తోసిపుచ్చడంతో ధోనీకి కోపం వచ్చింది. బెన్ స్టోక్స్ వేసిన బంతిని ఇంతకుముందు నో బాల్ అని పిలిచారు. కానీ, లెగ్ అంపైర్‌తో మాట్లాడిన తర్వాత, ఈ నిర్ణయాన్ని రద్దు చేశారు. దీంతో ఆగ్రహించిన ధోనీ డగౌట్ నుంచి మైదానానికి చేరుకున్నాడు. దీంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కూడా నో బాల్ కారణంగా హెడ్‌లైన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ఈ నిబంధన వర్తిస్తుందా?

అయితే, WPLలో ఈ కొత్త నియమం ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించగలదని భావిస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదు. సాంకేతికత అవసరం ఉంటే దానిని ఉపయోగించుకోవాలి. ఏదైనా నిర్ణయంపై వివాదం ఏర్పడితే, సాంకేతికంగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ జట్టుకైనా గెలుపు ఓటములకు ఒక్క నిర్ణయం, ఒక్క పరుగు కారణంగా వస్తుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..