GG vs UP: టాస్ గెలిచిన గుజరాత్.. మరోసారి ఆ తప్పు చేయని సారథి.. మూనీ స్థానంలో కెప్టెన్‌గా టీమిండియా ప్లేయర్..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ కెప్టెన్ స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ కెప్టెన్ స్నేహ రాణా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో యూపీ వారియర్స్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో లీగ్‌లోని మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ముంబై 143 పరుగుల తేడాతో ఓడించింది.
గుజరాత్ సారథిగా స్నేహ రాణా..
తొలి మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ గాయపడింది. ఆమె స్థానంలో స్నేహ రాణా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. యూపీకి అలిస్సా హీలీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
Hello from the DY Patil Stadium, Navi Mumbai ?
Time for some pre-match catchups before the #UPWvGG clash begins in the #TATAWPL ?@Sophecc19 ? @imharleenDeol pic.twitter.com/xwdw5Uwefu
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
జట్లు:
యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(w/c), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్.
గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(w), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(c), తనుజా కన్వర్, మాన్సీ జోషి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..