PSL 2022: పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌కి కరోనా ఎఫెక్ట్‌.. ఇప్పటికే 8 మందికి పాజిటివ్‌..

|

Jan 22, 2022 | 5:22 PM

PSL 2022: వచ్చేవారం నుంచి పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (PSL 2022) ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇంతలోనే కరోనా దాడి చేసింది. కరాచీలో జరగనున్న టోర్నమెంట్

PSL 2022: పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌కి కరోనా ఎఫెక్ట్‌.. ఇప్పటికే 8 మందికి పాజిటివ్‌..
Pakistan
Follow us on

PSL 2022: వచ్చేవారం నుంచి పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (PSL 2022) ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇంతలోనే కరోనా దాడి చేసింది. కరాచీలో జరగనున్న టోర్నమెంట్ పర్యటనకి ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది వస్తున్నారు ఈ సమయంలో చేసిన పరీక్షలో ముగ్గురు ఆటగాళ్లు, ఐదుగురు సహాయక సిబ్బంది మొత్తం ఎనిమిది మందికి కరోనా పాజిటవ్‌ అని తేలింది. దీంతో ఈ టోర్నిపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి జనవరి 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.

పీఎస్‌ఎల్ చివరి సీజన్ కూడా కరోనా బారిన పడింది. ఆ సమయంలో పాకిస్థాన్‌లోనే టోర్నీని నిర్వహిస్తున్నప్పటికీ, అనేక కేసులు తెరపైకి రావడంతో అకస్మాత్తుగా దాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ నెలలో యూఏఈలో ఈ టోర్నీ పూర్తయింది. ఇప్పుడు మరోసారి పిసిబి తన సొంత దేశంలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందే కరోనా కేసులు రావడం ఆందోళన మరింత పెంచింది.

ఈఎస్‌పిఎన్-క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం పాజిటివ్‌గా తేలిన ఎనిమిది మంది ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉన్నారు. వారు మళ్లీ కొవిడ్‌ టెస్ట్‌లో నెగిటివ్‌ తేలిన తర్వాత మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. జనవరి 14 నుంచి పిసిబి ఆటగాళ్లతో సహా టోర్నమెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులందరి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది హోటల్ కార్మికులు కూడా వ్యాధి బారిన పడ్డారు వారు కూడా ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు.

పీఎస్‌ఎల్‌లో కఠిన నిబంధనలు అమలు

ఈసారి లీగ్‌ని కరోనా బారి నుంచి తప్పించేందుకు పీసీబీ కఠిన నిబంధనలను అమలు చేసింది. దీని ప్రకారం కరాచీకి చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. కొవిడ్‌ టెస్ట్‌లో నెగిటివ్‌ రిపోర్ట్‌ రావాలి. తర్వాత మాత్రమే టోర్నమెంట్ బయో-సెక్యూర్ బబుల్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. పీఎస్ఎల్ సీజన్ 7 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది.

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. టెన్త్‌, ఇంటర్ అర్హత..

Aadhaar: ఆధార్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

రోజుకి 7 రూపాయలు ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్..! పెట్టుబడి ఎలా పెట్టాలో తెలుసుకోండి..?