Prithvi Shaw: ఆ నటితో పీకల్లోతు ప్రేమలో టీమిండియా క్రికెటర్‌.. ప్రేయసితో కలిసి గర్బా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌..

|

Oct 02, 2022 | 10:07 AM

దసరా నవరాత్రి సంబరాలు పురస్కరించుకుని పృథ్వీ షా తన ప్రేయసి నిధితో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. అంతేకాదు అతను నిధి తపాడియా వద్ద గర్బా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

Prithvi Shaw: ఆ నటితో పీకల్లోతు ప్రేమలో టీమిండియా క్రికెటర్‌.. ప్రేయసితో కలిసి గర్బా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌..
Prithvi Shaw, Nidhhi
Follow us on

టీమిండియా యంగ్ క్రికెటర్‌ పృథ్వీ షా ప్రేమలో పడ్డాడా? బాలీవుడ్‌కు చెందిన ఓ సీరియల్ నటితో డేటింగ్‌ చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పృథ్వీ గత కొంతకాలంగా నటి నిధి తపాడియాతో ప్రేయాణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తాజాగా దసరా నవరాత్రి సంబరాలు పురస్కరించుకుని పృథ్వీ షా తన ప్రేయసి నిధితో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. అంతేకాదు అతను నిధి తపాడియా వద్ద గర్బా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మవారి ముందు పృథ్వీ షా, నిధి తపాడియాలు దిగిన ఫొటోలు వైరల్‌ కావడంతో వీరిద్దరి డేటింగ్‌ వ్యవహారం మరోసారి అందరి నోళ్లలో నానుతోంది.

సచిన్‌ స్టై్‌ల్‌తో..

కాగా సచిన్‌ టెండూల్కర్‌ తరహా ఆటతీరుతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ మనసులు గెల్చుకున్నాడు పృథ్వీషా. అండర్‌-19, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 4 టెస్టులు, ఆరు వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. అయితే ఆశించినమేర రాకపోవడంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేస్తానని గట్టిగా చెబుతున్నాడు.

సింగర్‌గానూ..

నిధి తపాడియా విషయానికొస్తే.. పాపులర్‌ టీవీ సిరీసుల్లో ఒకటైన సీఐడీలో నటించిందీ అందాల తార. అంతేకాదు కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, వీడియో సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. ఇటీవలే టోనీ కక్కర్‌ ‘కిస్‌ యూ’ అనే ఆల్బమ్‌లో మరోసారి తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. ఇలా యాక్టింగ్, సింగింగ్‌, మోడలింగ్‌ రంగాల్లో సత్తా చాటుతున్న నిధి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంద. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తోంది. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆమెకు నెట్టింట భారీ ఫాలోయింగ్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

Prithvi Shaw, Nidhhi

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..