Prithvi Shaw Continues Golden Run: విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారుతోంది. సిక్సర్ల వర్షం కురుస్తోంది. తాజాగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో, ఆసీస్ గడ్డపై విఫలమైన ఈ కుర్రాడు.. విజయ్ హజారే ట్రోఫీలో శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడు.
కర్నాటకతో జరిగిన సెమీ ఫైనల్లో మ్యాచ్‌లో కేవలం 79 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీతో ఇప్పటివరకు 754 పరుగులు చేసిన పృథ్వీ.. టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.122 బంతులాడిన పృథ్వీ.. 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌లుగా ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ ఓపెనర్.. ఓ ద్విశతకంతో పాటు రెండు భారీ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
ఇక లిస్టు-ఏ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన పృథ్వీ.. ధోనీ, కోహ్లీలను అధిగమించాడు. ఇటీవల సౌరాష్ట్రపై కేవలం 123 బంతుల్లోనే 185 పరుగులు చేయడం ద్వారా పృథ్వీ ఈ ఫీట్‌ను సాధించాడు. 2005లో జైపూర్ వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా 2012లో పాకిస్తాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.
A win for Uttar Pradesh! ??
The Karan Sharma-led unit beat Delhi by 46 runs in the @Paytm #VijayHazareTrophy #QF3 & seal a place in the semifinals. ?? #UPvDEL
Scorecard ? https://t.co/CeQ0BWMhTm pic.twitter.com/mXZlktauZ8
— BCCI Domestic (@BCCIdomestic) March 9, 2021