Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ శుక్రవారం (జనవరి 10) బృందావన్‌లోని ప్రేమానంద జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో కోహ్లీకి ప్రేమానంద మహరాజ్ కొన్ని ప్రత్యేక సలహాలు ఇచ్చారంట. విరుష్క జోడీ భేటీలో ప్రేమానంద మహరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. విజయాలతో శిఖరాగ్రంలో ఉన్నప్పటికీ మీరిద్దరూ ఆధ్యాత్మికత వైపు మళ్లడం గొప్ప విషయమని అన్నారు. పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి కొన్ని చిట్కాలు కూడా చెప్పారు.
క్రికెట్‌ను ఆధ్యాత్మిక సాధనగా అభివర్ణించిన ప్రేమానంద మహరాజ్.. ప్రాక్టీస్‌ను ఎప్పుడూ ఆపకూడదని కోహ్లీకి సూచించారంట. ప్రాక్టీస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారంట.
అలవాటును బలపరచుకోవడం మీ కర్తవ్యంగా మారాలని, అది క్రీడే అయినా నీ ఆటతో యావత్ భారతదేశం సంతోషిస్తుందని ఆయన చెప్పారంట. అలాగే, మీ ఆచరణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, దీనితో పాటు భగవంతుని స్మరణ కూడా చేయాలని సూచించారంట. వీటి ద్వారా పేలవమైన ఫామ్ నుంచి తిరిగి రావాలంటే కఠోర సాధన కీలకమని తెలిపారంట.
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, సిరీస్ ముగిసిన వెంటనే ప్రేమానంద్ మహరాజ్‌ను కలిశారు. దీంతో ఫ్యాన్స్ మరోాసరి కోహ్లీ పాత ఫాంలోకి వచ్చేస్తాడని భావిస్తున్నారు. అందుకు కారణం కూడా ఉందండోయ్.. ఎందుకంటే గతంలో ఈ గూరుజీని కలిసిన తర్వాత కోహ్లీ అద్భుత ఫాంలో కనిపించాడని వారు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కింగ్ కోహ్లీ నుంచి అద్భుతమైన బ్యాటింగ్‌ను ఆశించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..