Prakhar Chaturvedi in Cooch Behar Trophy: కూచ్ బెహార్ ట్రోఫీలో ముంబై, కర్ణాటక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రఖర్ చతుర్వేది బ్యాట్‌తో అద్భుతాలు చేసి భారీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ప్రఖార్ 404 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కూచ్ బెహార్ ఫైనల్‌లో ఏ బ్యాట్స్‌మెన్ ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్ ఇదే. ఈ టోర్నీ ఫైనల్‌లో 400 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2000 సంవత్సరంలో 358 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడిన భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును ప్రఖర్ బద్దలు కొట్టాడు.
కూచ్ బెహార్ ట్రోఫీలో ముంబైపై 404 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కర్ణాటక అండర్-19 జట్టు ఆటగాడు ప్రఖర్ చతుర్వేది కీలక ప్రకటన చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌లో, ముంబై ప్రజలు తమ జట్టు మొత్తం కంటే నేను ఒంటరిగా ఎక్కువ పరుగులు చేయగలనని చెబుతున్నారని, అదే జరిగిందని చెప్పుకొచ్చాడు.
తన ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు కొట్టిన ప్రఖర్ చతుర్వేది..
Creating history in the Cooch Behar Trophy, #PrakharChaturvedi of Karnataka achieved an unprecedented milestone by becoming the first player to cross 400 runs in the final, and remained unbeaten at 404 against Mumbai. The opening batsman’s extraordinary performance in the U-19… pic.twitter.com/xvpNUd99D9
— Jay Shah (@JayShah) January 15, 2024
ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 145 పరుగులతో ఆయుష్ మ్హత్రే సెంచరీ చేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. కర్ణాటక తరపున ఫాస్ట్ బౌలర్ హార్దిక్ రాజ్ 4 వికెట్లు, రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ 2 వికెట్లు తీశారు. ప్రఖర్ 404 పరుగుల సహాయంతో కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్‌ను 890 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రఖర్ తన ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం క్రికెట్ నెక్స్ట్‌తో మాట్లాడుతూ.. ఇలాంటి మ్యాచ్‌లో రాణించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు కీలక మ్యాచ్. ఆటను చూసేందుకు చాలామంది వచ్చారు. 400 పరుగులు చేయడం నాకు చాలా గర్వకారణం అంటూ చెప్పుకొచ్చాడు.
Prakhar Chaturvedi becomes the only batter to score 400 runs in Cooch Behar Trophy Final 🌟🙌#prakharchaturvedi #coochbehartrophy #CricketTwitter #cricket pic.twitter.com/PwIjE2TTgn
— Cricket Uncut (@CricketUncutOG) January 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..