PBKS Vs KKR: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో మావా.! మ్యాడ్ మాక్సీ తుస్సుమనిపించాడు.. ఇక గెట్ అవుట్ ప్లీజ్
IPL 2025లో పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచింది. పెద్ద విషయం ఏమిటంటే ఈ జట్టులోని పెద్ద ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటివరకు పెద్దప్రభావం చూపించలేకపోయాడు. ఇప్పుడు అతన్ని జట్టు నుంచి తప్పించాలని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు..

పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రీతి జింటా జట్టులో నుంచి గ్లెన్ మాక్స్‌వెల్‌ను తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మాజీ క్రికెటర్లది కూడా ఇదే మాట. ఈ విషయాన్ని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్, కామెంటేటర్ సైమన్ డౌల్ అన్నారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు మంచి ప్రదర్శన ఇవ్వలేదు. అతడ్ని బెంచ్‌పై ఉంచి.. మిగిలిన ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. పాంటింగ్, అయ్యర్ ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇది పంజాబ్ కింగ్స్‌కు మంచిదని చెప్పారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు, మాక్స్‌వెల్ నాలుగు ఇన్నింగ్స్‌లలో 0, 30, 1, 3 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తం 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతను బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసుకున్నాడు. కానీ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 30 పరుగులు చేసినప్పటికీ, అతని ఆటతీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో కూడినదిగా కనిపించలేదు. పంజాబ్ కింగ్స్ ఇప్పుడు అజ్మతుల్లా ఉమర్జాయ్ లేదా జోష్ ఇంగ్లిస్‌కి అవకాశం ఇచ్చి మాక్స్‌వెల్‌ను తొలగించాలని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. మ్యాక్సీకి తగినంత అవకాశాలు వచ్చాయని తాను భావిస్తున్నానని.. అతను ఔట్ అవుతున్న తీరు తనను కోచ్‌గా నిరాశపరుస్తుంది. అతని స్థానంలో ఉమర్జాయ్ లేదా ఇంగ్లీస్‌ను జట్టులో తీసుకోవచ్చు.
లాకీ ఫెర్గూసన్ గాయం..
పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ IPL 2025 నుంచి దూరం కావడం ఖాయం అని తేలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గాయపడిన తర్వాత అతను టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫెర్గూసన్ లేకపోవడం జట్టుకు పెద్ద నష్టమని డౌల్ అన్నారు. ‘లాకీ ఫెర్గూసన్ లేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బ. మిడిల్ ఓవర్లలో అతని బౌలింగ్ జట్టుకు ముఖ్యమైనది. ఇప్పుడు అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఎవరిని జట్టులో చేర్చుకుంటుందో చూడాలి’ అని చెప్పారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..