PBKS vs GT Highlights, IPL 2022: శుభమన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. హోరాహోరీ మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ విజయం..

Venkata Chari

| Edited By: Basha Shek

Updated on: Apr 08, 2022 | 11:42 PM

Punjab Kings vs Gujarat Titans Highlights in Telugu: టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

PBKS vs GT Highlights, IPL 2022: శుభమన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. హోరాహోరీ మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ విజయం..
Pbks Vs Gt Live Score, Ipl 2022

PBKS vs GT, IPL 2022: IPL 2022 17వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో  జరిగిన  మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)  ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ శుభ్‌మన్‌ (96) సూపర్‌ ఇన్నింగ్స్‌ తో సులభంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో అతడితో పాటు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (27) ఔటవ్వడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి రెండు బంతులకు 12 అవసరం కాగా ఓడియన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి గుజరాత్‌కు ఘనవిజయాన్ని అందించాడు రాహుల్‌ తెవాతియా. అంతకుముందు  టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లివింగ్‌స్టోన్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 35, జితేష్ శర్మ 23, షారుక్ ఖాన్ 15 పరుగులు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అియతే చివర్లో రాహుల్ చాహర్ 22, అర్షదీప్ సింగ్ 10 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నల్కండే 2, షమీ, పాండ్యా, ఫెర్గ్యూసేన్ తలో వికెట్‌ను పడగొట్టారు.

ఇరు జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): మాథ్యూ వేడ్(కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

Key Events

జట్టులోకి వచ్చిన జానీ బెయిర్‌స్టో

జానీ బెయిర్‌స్టో ఈరోజు అందుబాటులో ఉన్నాడు. దీంతో పంజాబ్ జట్టు అతనికి అవకాశం ఇచ్చి, మరింత బలంగా మారనుంది.

గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందా..

హ్యాట్రిక్ విజయం సాధించాలని గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండింట్లో విజయం సాధించింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 Apr 2022 11:38 PM (IST)

    తెవాతియా సిక్స్‌ ల వర్షం.. గుజరాత్‌ సూపర్‌ విక్టరీ..

    రాహుల్‌ తెవాతియా (3 బంతుల్లో 13) పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. చివరి రెండు బంతుల్ల రెండు సిక్స్‌లు బాది గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ శుభ్‌మన్‌ (96) సూపర్‌ ఇన్నింగ్స్‌ తో సులభంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో అతడితో పాటు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (27) ఔటవ్వడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి రెండు బంతులకు 12 అవసరం కాగా ఓడియన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి గుజరాత్‌కు ఘనవిజయాన్ని అందించాడు రాహుల్‌ తెవాతియా.

  • 08 Apr 2022 11:26 PM (IST)

    హార్దిక రనౌట్..

    చివరి ఓవర్‌ లో 19 రన్స్‌ అవసరం కాగా హార్దిక్‌ పాండ్యా (27) మొదటి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌ (1), రాహుల్‌ తెవాతియా (0) ఉన్నారు.

  • 08 Apr 2022 11:22 PM (IST)

    త్రుటిలో సెంచరీ కోల్పోయిన శుభ్‌మన్‌.. గుజరాత్‌ మూడో వికెట్‌ డౌన్‌.

    గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (96) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. నిలకడగా ఆడుతున్న అతడిని రబాడా బోల్తా కొట్టించాడు. మరోవైపు క్రీజులో కెప్టెన్‌ హార్ధిక్‌ (27) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు అవసరం.

  • 08 Apr 2022 11:09 PM (IST)

    150 పరుగులు దాటిన లక్నో స్కోరు..

    లక్నో స్కోరు 150 పరుగులు దాటింది. శుభ్‌మన్‌ (90) సెంచరీవైపు పయనిస్తుండగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15) ధాటిగా ఆడుతున్నాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆజట్టు స్కోరు 153/2.

  • 08 Apr 2022 10:58 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతోన్న సాయి సుదర్శన్‌ (35) రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. మరోవైపు శుభ్‌మన్‌ (89) ధాటిగా ఆడుతున్నాడు. గుజరాత్‌ విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం.

  • 08 Apr 2022 10:32 PM (IST)

    శుభ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీ..

    శుభ్‌మన్‌ గిల్‌ టోర్నీలో వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించాడు. అతనికి తోడుగా క్రీజులో సాయి సుదర్శన్‌ (27) ఉన్నాడు. ప్రస్తు్తం ఆజట్టు స్కోరు 10 ఓవర్లు ముగిసే సరికి 94/1. ఆ జట్టు విజయానికి ఇంకా 60 బంతుల్లో 96 పరుగులు అవసరం.

  • 08 Apr 2022 10:09 PM (IST)

    50 పరుగులు దాటిన గుజరాత్‌ స్కోరు..

    గుజరాత్‌ స్కోరు 50 పరుగులు దాటింది. శుభ్‌మన్‌ (33), సాయి సుదర్శన్‌ (12) ధాటిగా ఆడుతున్నారు. పవర్‌ ప్లే ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 53/1.

  • 08 Apr 2022 10:00 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన గుజరాత్.. మాథ్యూ వేడ్‌ ఔట్‌..

    గుజరాత్‌ మొదటి వికెట్ కోల్పోయింది. రబాడా బౌలింగ్‌ లో మాథ్యూ వేడ్‌ (6) ఔటయ్యాడు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్‌ (13 బంతుల్లో 25) ధాటిగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ స్కోరు 37/1

  • 08 Apr 2022 09:26 PM (IST)

    గుజరాత్ టార్గెట్ 190

    టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 08 Apr 2022 09:07 PM (IST)

    8వ వికెట్ డౌన్..

    రబాడ(1) రూపంలో పంజాబ్ కింగ్స్ 8వ వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసేన్ బౌలింగ్‌లో రనౌ‌ట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 156 పరుగుల వద్ద పంజాబ్ టీం 8వ వికెట్‌ను కోల్పోయింది.

  • 08 Apr 2022 09:04 PM (IST)

    16 ఓవర్లకు స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి పంజాజ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. రాహుల్ చాహర్ 1, రబాడ 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Apr 2022 08:59 PM (IST)

    6వ వికెట్ డౌన్..

    లివింగ్‌స్టోన్(64) రూపంలో పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 153 పరుగుల వద్ద పంజాబ్ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది.

  • 08 Apr 2022 08:49 PM (IST)

    14 ఓవర్లకు స్కోర్..

    14 ఓవర్లు ముగిసే సరికి పంజాజ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ 59, షారుక్ ఖాన్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Apr 2022 08:45 PM (IST)

    5వ వికెట్ డౌన్..

    ఓడియన్ స్మిత్(0) రూపంలో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. నల్కండే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 124 పరుగుల వద్ద పంజాబ్ టీం వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.

  • 08 Apr 2022 08:43 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    జితేష్(23) రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. నల్కండే బౌలింగ్‌లో కీపెవిలియన్ చేరాడు. దీంతో 124 పరుగుల వద్ద పంజాబ్ టీం 4వ వికెట్‌ను కోల్పోయింది.

  • 08 Apr 2022 08:27 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    శిఖర్ ధావన్(35) రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్‌ను కోల్పోయింది. రషిద్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 86 పరుగుల వద్ద పంజాబ్ టీం 3వ వికెట్‌ను కోల్పోయింది.

  • 08 Apr 2022 08:04 PM (IST)

    6 ఓవర్లకు స్కోర్..

    6 ఓవర్లు ముగిసే సరికి పంజాజ్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. శిఖర్ 24, లివింగ్‌స్టన్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 08 Apr 2022 07:45 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న పంజాబ్ కింగ్స్ టీంకు ఆదిలోనే ఎదురుదెబ్ తగిలింది. గుజరాత్ సారథి హార్దిక్ బౌలింగ్‌లో పంజాబ్ సారథి మయాంక్(5) పెవిలియన్ చేరాడు.

  • 08 Apr 2022 07:38 PM (IST)

    మొదలైన పంజాజ్ బ్యాటింగ్

    టాస్ ఓడిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ మేరకు ఓపెనర్లుగా శిఖర్ ధావన్, మయాంక అగర్వాల్ బ్యాటింగ్‌కు దిగారు.

  • 08 Apr 2022 07:08 PM (IST)

    పంజాబ్ కింగ్స్ జట్టు

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

  • 08 Apr 2022 07:07 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ జట్టు:

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): మాథ్యూ వేడ్(కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

  • 08 Apr 2022 07:00 PM (IST)

    Punjab vs Gujarat Live Score: హ్యాట్రిక్ విజయం కోసం గుజరాత్, మూడో విజయం కోసం పంజాబ్..

    ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ నేడు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ ఈ మ్యాచ్‌పై కన్నేసింది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్, రెండు మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండింట్లో విజయం సాధించింది. ఈరోజు మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది. అయితే గుజరాత్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ఈ మ్యాచ్‌లో గెలవడం అంత సులువు కాదు.

Published On - Apr 08,2022 6:54 PM

Follow us
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?