Video: మరోసారి పాకిస్తాన్ ఫీల్డింగ్ గుర్తు చేసిన లక్నో టీం.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..

|

Mar 27, 2025 | 9:12 PM

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడుతున్నాయి. పర్యాటక జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా ఫీల్డింగ్ చేస్తోన్న రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టేసింది.

Video: మరోసారి పాకిస్తాన్ ఫీల్డింగ్ గుర్తు చేసిన లక్నో టీం.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Matchessrh Vs Lsg Livecsk Vs Rcb Previewrr Vs Kkr Kkr Wonpbks Vs Gt Pbks Wonlsg Vs Dc Dc Wonall Sunrisers Hyderabad Vs Lucknow Super Giants
Follow us on

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడుతున్నాయి. పర్యాటక జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా ఫీల్డింగ్ చేస్తోన్న రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు ప్రారంభంలోనే రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టేసింది.

ఎస్‌ఆర్‌హెచ్ జట్టును ఆశ్చర్యపరిచిన కుడిచేతి వాటం సీమర్ శార్దూల్ ఠాకూర్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిల కీలక ఇన్నింగ్స్‌తో కోలుకుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పల్‌లో పాక్ ఫీల్డింగ్‌ను గుర్తు చేసిన లక్నో..

ఇద్దరు స్టార్ బ్యాటర్లు వికెట్ పడినా హైదరాబాద్ జట్టు ఏమాత్రం కంగారు పడలేదు. ఈ క్రమంలో లక్నో ఫీల్డర్లు కూడా పరిస్థితిని అదుపుచేయలేక చేతులెత్తేశారు. ఎందుకంటే, రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు క్యాచ్‌లు జారివిడిచారు.

నికోలస్ పూరన్ ఓ క్యాచ్ మిస్ చేయగా, ఆ తరువాత రవి బిష్ణోయ్ కూడా తన ఓవర్‌లో హెడ్‌కు లైఫ్‌లైన్‌ను అందించాడు. ఇంకా, దిగ్వేష్ సింగ్ రథి ఓవర్ కూడా వినోదంతో నిండిపోయింది. ఎందుకంటే, అనేక తప్పిదాల తర్వాత ఫీల్డ్‌లో నవ్వులు పూయించారు.

ముఖ్యంగా, 7వ ఓవర్ మొదటి బంతికి నితీష్ రెడ్డి సింగిల్ కోసం దాన్ని ఫ్లిక్ చేశాడు. కానీ, ఫీల్డర్ దానిని మిస్ ఫీల్డ్ చేశాడు. దాని ఫలితంగా అదనపు పరుగు వచ్చింది. ఇది అంతటితో ఆగలేదు. ఎందుకంటే వేవార్డ్ త్రో అందుకోవడంలో మరో ఫీల్డర్ విఫలమవడం వల్ల మరొక అదనపు పరుగు వచ్చింది.

అప్పుడు కెమెరా పంత్ పై దృష్టి పెట్టింది. అతను స్టంప్స్ వెనుక నిస్సహాయంగా కనిపించాడు. ఆ సంఘటన చూస్తే.. పాక్ ఫీల్డింగ్ గుర్తుకు రావడం ఖామం.

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్..

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: షాబాజ్, మణిమారన్ సిద్ధార్థ్, మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..