PCB: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాక్ క్రికెట్ బోర్డు.. జెర్సీపై ఇండియా పేరు తొలగింపు.. వెల్లువెత్తున్న విమర్శలు..

|

Oct 07, 2021 | 5:46 PM

టీ20 వరల్డ్‎కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అవగానే అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‎కప్2021 ప్రారంభం కానుంది. చాలా జట్లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు చెలరేగుతున్నాయి...

PCB: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాక్ క్రికెట్ బోర్డు.. జెర్సీపై ఇండియా పేరు తొలగింపు.. వెల్లువెత్తున్న విమర్శలు..
Pak
Follow us on

టీ20 వరల్డ్‎కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అవగానే అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‎కప్2021 ప్రారంభం కానుంది. చాలా జట్లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ దీనికి కారణంగా నిలుస్తోంది. పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్‎గా మారింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​2021ను భారతదేశంలో నిర్వహించాల్సింది. కానీ, భారత్‎​లో కరోనా​సంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, ఒమన్​ వేదికల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పాల్గొనే జట్లు అన్నీ ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ఇండియా 2021’ అనే లోగో ఉన్న జెర్సీలను ధరించాల్సి ఉంది. పీసీబీ మాత్రం అందుకు భిన్నంగా టోర్నీని యూఏఈ పేరుతో(ఐసీసీ టీ20 ప్రపంచకప్​ యూఏఈ 2021) ఉన్న జెర్సీలతో ఫొటో షూట్​ చేసింది.

 

ఈ ఫొటో షూట్‎​కు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‎​గా మారాయి. పీసీబీ చర్యలపై పలువురు క్రికెట్​ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు జెర్సీపై మాత్రం ఇండియా నిర్వహిస్తున్నట్లు ఉంది. పాకిస్తాన్ కావాలనే ఇలా చేసిందని విమర్శిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో అక్టోబర్ 24న భారత్ తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే టీ20, వన్డేల్లో పాక్‎పై ఇండియాకు గొప్ప రికార్డే ఉంది.

Read Also.. IPL 2021 CSK vs PBKS: డు ప్లెసిస్‌ చెలరేగడంతో గట్టెక్కిన చెన్నై.. పంజాబ్‌ విజయ లక్ష్యం ఎంతంటే..