World Cup 2023: పాక్‌తో వార్మప్ మ్యాచ్.. భద్రత ఇవ్వలేమన్న హైదరాబాద్ పోలీస్.. ఫ్యాన్స్‌లో గందరగోళం..

|

Sep 21, 2023 | 8:30 PM

ప్రఖ్యాత ప్రదేశాలను చుట్టేసిన ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ హైదరాబాద్‌లోనూ సందడి చేసింది. వరల్డ్‌ టూర్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో ప్రదర్శించిన ట్రోఫీ అందర్నీ ఆకట్టుకుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఔరా అనిపించింది. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని దగ్గరగా చూసి తెగ మురిసిపోయారు నగరవాసులు.

World Cup 2023: పాక్‌తో వార్మప్ మ్యాచ్.. భద్రత ఇవ్వలేమన్న హైదరాబాద్ పోలీస్.. ఫ్యాన్స్‌లో గందరగోళం..
Cricket
Follow us on

ప్రఖ్యాత ప్రదేశాలను చుట్టేసిన ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీ హైదరాబాద్‌లోనూ సందడి చేసింది. వరల్డ్‌ టూర్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో ప్రదర్శించిన ట్రోఫీ అందర్నీ ఆకట్టుకుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఔరా అనిపించింది. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని దగ్గరగా చూసి తెగ మురిసిపోయారు నగరవాసులు. అటు.. ఉప్పల్‌ స్టేడియంలో 29న జరగాల్సి వరల్డ్‌ కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ నిర్వహణ సస్పెన్స్‌గా మారింది. బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్.

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఈ నెల 29న న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్‌పై గందరగోళం నెలకొంది. నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ నేపథ్యంలో భద్రత ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటికే టిక్కెట్లు అమ్మడంతో పరిస్థితిని బీసీసీఐకి వివరించింది హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్. దాంతో.. ప్రస్తుతం బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది HCA. ఇక.. వార్మప్‌ మ్యాచ్‌ భద్రతపై చర్చలు సాగుతున్నాయన్నారు రిటైర్డ్‌ ఐపీఎస్‌ దుర్గాప్రసాద్‌.

మొత్తంగా.. వచ్చే నెల 5 నుంచి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సంబరం ప్రారంభం కాబోతోంది. అయితే.. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే వార్మప్‌ మ్యాచ్‌పై సస్పెన్స్‌ నెలకొంది. టిక్కెట్లు అమ్మిన నేపథ్యంలో అభిమానులకు అనుమతి ఉంటుందా?.. లేక.. ఫ్యాన్స్‌ లేకుండానే నిర్వహించి.. HCA డబ్బులు వాపస్‌ ఇస్తుందా అన్నది చూడాలి.

మరోవైపు బంగారు వర్ణంలో మెరిసిపోయే వరల్డ్‌ కప్‌ ట్రోఫీని లండన్‌లోని గారార్డ్‌ అనే లగ్జరీ జ్యూయలరీ తయారీ సంస్థ రూపొందించింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు. 60 సెంటీమీటర్ల ఎత్తులో బంగారు వర్ణంలో గ్లోబు ఉంది. మూడు సిల్వర్‌ కాలమ్‌లు ఉన్నాయి. పసిడి వర్ణపు గ్లోబు, మూడు సిల్వర్‌ కాలమ్‌లతో ట్రోఫీ ఆకట్టుకుంటుంది. సుమారు 11 కిలోల బరువుండే ఈ ట్రోఫీ విలువ 30లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్రోఫీని 1999 ప్రపంచ కప్‌ కోసం తొలిసారి డిజైన్‌ చేశారు. అప్పటినుంచి ఈ డిజైన్‌ ట్రోఫీనే ఐసీసీ కొనసాగిస్తోంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌కు ట్రోఫీని అందజేసి.. ఆ తర్వాత మాత్రం.. దాని నమూనాను ఇస్తున్నారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత పేర్లను ముద్రిస్తారు.

వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే:

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ