టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో సునాయాసంగా విజయాన్ని ముద్దాడింది. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు పాక్‌ను కట్టడి చేయడంలో విజయవంతమైతే, మరోవైపు బ్యాటర్లు లక్ష్యాన్ని చేధించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇంగ్లండ్ వరల్డ్ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకొని సరికొత్త చరిత్రను లిఖించారు. స్టార్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ (52)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి విజయం సాధిచింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది ఇంగ్లండ్. ఇక టీ20 వరల్డ్ కప్ అందుకున్న ఇంగ్లండ్‌కు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ రూ. 6.5 కోట్లు అందుకోనుంది.
జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జొర్డాన్, అదిల్ రషీద్
బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసిమ్ జూనియర్, నసీమ్ షా, హారిస్ రవుఫ్, షహీన్ షా అఫ్రిది
టీ20 వరల్డ్‌కప్ 2022ని ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. పటిష్టమైన బౌలింగ్, అదే స్థాయిలో బ్యాటర్లు కూడా రాణించడంతో ఇంగ్లండ్ విజయతీరాలను సునాయాసంగా చేరుకుంది. పాకిస్థాన్ ఇచ్చిన 138 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టానికి సునాయాసంగా గెలుచుకుంది. బెన్ స్టోక్స్ 52 అజేయంగా నిలిచి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ గెలుపునకు చేరువవుతోందని అనుకుంటున్న సమయంలో ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ పెవిలియన్ బాట పట్టాడు.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. బెన్ స్ట్రోక్స్ అద్భుత ఆటతీరుతో జట్టును విజయానికి చేరువ చేస్తున్నాడు. ప్రస్తుతం పాక్ విజయానికి 18 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది.
ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా జట్టు స్కోర్ పెరుగుతుందని అనుకుంటోన్న సమయంలో షాదాబ్ ఖాన్ ఇంగ్లండ్‌కు దొబ్బ కొట్టాడు. 20 పరుగుల వద్ద హారీ బ్రుక్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. షహీన్ షా అఫ్రిద్‌కు క్యాచ్ ఇచ్చి హారీ బ్రూక్ పెవిలియన్ బాటపట్టాడు.
వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో బెన్ స్ట్రోక్స్, హారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును నెమ్మదిగా పరుగులు పెట్టిస్తున్నారు. 26 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యంతో మంచి స్టాండింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్ స్కోర్ 10 ఓవర్లకు 77 పరుగులు వద్ద కొనసాగుతోంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 60 బంతుల్లో 61 పరుగులు సాధించాల్సి ఉంది.
పాకిస్థాన్ బౌలర్ల దూకుడుకు ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో దూకుడుమీదున్న బట్లర్‌ను పెవిలియన్ బాట పట్టించారు. హారిస్ రవుఫ్ బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిలిప్ సాల్ట్ పెవిలియన్ బాటపట్టాడు. హారిస్ రవుఫ్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షహీన్ ఆఫ్రీది అద్భుత బౌలింగ్‌లో అలెక్స్ హేల్స్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కేవలం 7 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడానికి జరిగిన తుది పోరులో ఇంగ్లండ్ బౌలర్లు రాణించారు. తొలుత పాకిస్థాన్ బ్యాటర్లు దూకుడుగా ఆడినా తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు పటిష్టంగా బౌలింగ్ చేసి పాక్ జోరుకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి 138 పరుగులు చేయాల్సి ఉంది.
బంతులు ముగుస్తోన్న సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు మరింత పటిష్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పాక్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మరో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ వాసిమ్ జూనియర్ 04 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
సామ్ కరన్ వేసిన బౌలింగ్‌లో నవాజ్ (5) ఔటయ్యాడు. 19 ఓవర్లకు స్కోరు 131/7.మహ్మద్ వసీమ్ (4), షాహీన్ అఫ్రిది (1) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాకిస్థాన్ ప్లేయర్స్ వరుసగా పెవిలియన్ బాటపడుతున్నారు. 20 పరుగుల వద్ద షాదాబ్ ఖాన్ అవుట్ అయ్యాడు. జోర్దాన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడని అనుకుంటున్న సమయంలోనే షాన్ మసూద్ అవుట్ అయ్యాడు. 38 పరుగులతో దూకుడుగా ఆడిన మసూద్.. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం పాక్ స్కోర్ 17 ఓవర్లు ముగిసే సమయానికి 122 పరుగుల వద్ద కొనసాగుతోంది.
పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. క్రీజులోకి వచ్చి రాగానే ఇఫ్తికార్ అహ్మద్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. స్ట్రోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్‌కి వెనుదిరిగాడు.
పాకిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. బాబార్ అజమ్ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 28 బంతుల్లో 32 పరుగులు సాధించి ఫామ్‌లో ఉన్న బాబార్ రషీద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (27) దూకుడు పెంచాడు. జొర్డాన్ వేసిన ఈ ఓవర్‌లో ఫోర్ సహా 9 పరుగులు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ స్కోరు 59/2కి చేరింది.
ఆదిల్ రషీద్ వేసిన రెండో బంతికి షాన్ మసూద్ సింగిల్ తీశాడు.
డాట్ బాల్. క్రిస్ జోర్డాన్ వేసిన ఆరో బంతికి పరుగులేమీ రాలేదు.
క్రిస్ జోర్డాన్ వేసిన ఐదో బంతికి షాన్ మసూద్ సింగిల్ తీశాడు.
ఆదిల్ రషీద్ వేసిన ఓవర్ తొలి బంతికే మహ్మద్ హరీస్ ఔటయ్యాడు. పాకిస్థాన్ 45 పరుగుల వద్ద రెండో వికెట్‌ను సమర్పించుకుంది. 7.1వ ఓవర్‌లో అదిల్ రషీద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన హారిస్ (8) స్టోక్స్ చేతికి చిక్కాడు. అయితే వరుసగా రెండు డబుల్స్ రావడంతో పాక్ స్కోరు 8 ఓవర్లకు 50/2కి చేరింది. క్రీజ్‌లో బాబర్ (20*), షాన్ మసూద్ (1*) ఉన్నారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్లో రెండు ఫోర్లు సహా 10 పరుగులు వచ్చాయి. దీంతో పాక్ స్కోరు 39/1. క్రీజ్‌లో బాబర్ (16), హారిస్ (4) కొనసాగుతున్నారు.
29 పరుగుల వద్ద తొలి వెకెట్ కోల్పోయిన పాకిస్తాన్. మహ్మద్ రిజ్వాన్ ఔటయ్యాడు. సామ్ కుర్రాన్ వేసిన బౌలింగ్‌లో మహ్మద్ రిజ్వాన్‌ను డగౌట్ అయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ 15 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాడు. దీంతో 29 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ ఓవర్‌లో సామ్ కరన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు పాక్ స్కోరు 29/1. క్రీజ్‌లో బాబర్ (11), మహమ్మద్ హారిస్ (0) ఉన్నారు.
పాకిస్థాన్ ఖాతాలో మరో పరుగు. పాక్ మొత్తం స్కోరు 29
ఇంగ్లాండ్ యువ బౌలర్ సామ్ కరన్ కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. దీంతో పాక్ ఓపెనర్లు బాబర్ (6), రిజ్వాన్ (7) పరుగులు చేసేందుకు కాస్త కష్టపడాల్సి వస్తోంది. ఈ ఓవర్‌లో నాలుగు పరుగులే తీయగలిగారు . దీంతో ఇప్పటి వరకు పాక్ స్కోరు 16/0.
డాట్ బాల్. బెన్ స్టోక్స్‌కు మరో డాట్ బాల్.
నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 11 మంది ఆడుతున్నది- జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ చెరింగ్టన్ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, సామ్ కరణ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్
నో బాల్! మరో 1 అదనపు పరుగు, పాకిస్థాన్ మొత్తం 1
ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ ఓడిపోయింది. నేటి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 11 మంది ఆడుతున్న తీరు ఇలా ఉంది – మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్‌లో అంపైర్లుగా కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గాఫ్నీ, రిఫరీ రంజన్ మదుగల్లె ఉన్నారు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG), మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కోసం వాతావరణ నివేదిక ఇలా ఉంది.