1800 కోట్లతో గడాఫీ స్టేడియంలో మార్పులు.. కట్‌చేస్తే.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి పాక్ ఔట్

Gaddafi Stadium Lahore: పీసీబీ తన సంపదను ఖర్చు చేసి నిర్మించిన స్టేడియంలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. పాపం, ఐసీసీ ఈవెంట్‌కు ముందు గడాఫీ స్టేడియాన్ని 1000 మంది కార్మికుల సహాయంతో పునర్మించారు. ఈ పనికి మొత్తం 117 రోజులు పట్టింది. రూ. 1800 కోట్లు ఖర్చయింది. స్టేడియం సిద్ధమైనప్పుడు, స్టేడియం నిర్మాణం కోసం దాదాపు రూ.1300 కోట్లు కేటాయించినట్లు పీసీబీ ఒక ప్రకటన ఇచ్చింది. కానీ, అనతికాలంలోనే ఖర్చు రూ.1800 కోట్లకు చేరుకుంది.

1800 కోట్లతో గడాఫీ స్టేడియంలో మార్పులు.. కట్‌చేస్తే.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి పాక్ ఔట్
Gaddafi Stadium Lahore

Updated on: Feb 25, 2025 | 4:16 PM

Gaddafi Stadium Lahore: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం గొప్ప ఆశయాలతో ఒక స్టేడియం నిర్మించింది. దానికి కొత్త రూపాన్ని ఇచ్చింది. కానీ, ఇప్పుడు దాని సొంత జట్టు అక్కడ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. దీనిని ఐసీసీ ఈవెంట్‌కు ముందు 1000 మంది కార్మికుల సహాయంతో పునర్మించారు. ఈ పనికి మొత్తం 117 రోజులు పట్టింది. రూ. 1800 కోట్లు ఖర్చయింది. స్టేడియం సిద్ధమైనప్పుడు, స్టేడియం నిర్మాణం కోసం దాదాపు రూ.1300 కోట్లు కేటాయించినట్లు పీసీబీ ఒక ప్రకటన ఇచ్చింది. కానీ, అనతికాలంలోనే ఖర్చు రూ.1800 కోట్లకు చేరుకుంది.

రూ. 1800 కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క మ్యాచ్ ఆడని పాకిస్తాన్..

అయితే, రూ.1800 కోట్లతో నిర్మించిన స్టేడియంలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడదు. ఎందుకంటే, గ్రూప్ దశ నుంచే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు ఉంది. ఈ గ్రూప్ నుంచి సెమీ-ఫైనల్స్‌కు వెళ్లే రెండు జట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి భారతదేశం కాగా, మరొకటి న్యూజిలాండ్. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ విజయ ఖాతాను తెరవలేకపోయాయి. దీంతో ఈ రెండు జట్లు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

సెమీ-ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు తన మొదటి మ్యాచ్‌ను కరాచీలో, రెండవ మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడింది. ఇప్పుడు ఫిబ్రవరి 27న రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో మూడవ మ్యాచ్ ఆడనుంది. దీని అర్థం ఇప్పుడు లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడటం కష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తే, అది టోర్నమెంట్‌లో రెండవ సెమీ-ఫైనల్ ఆడవలసి ఉంటుంది. అలాంటప్పుడు పాక్ జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆడగలిగేది. కానీ, ఇప్పుడు అలా జరిగే అవకాశాలు కనుమరుగయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గడాఫీలో ఆడిన పాకిస్తాన్ జట్టు..

అయితే, లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పునరుద్ధరణ తర్వాత పాకిస్తాన్ ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్టేడియం పూర్తయిన తర్వాత, ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. కానీ, ఆ మ్యాచ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినది కాదు. ట్రై సిరీస్ కి సంబంధించినది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, పాకిస్తాన్ ట్రై-సిరీస్ ఆడింది. దీనిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..