
Pakistan out of Semi Finals: ప్రపంచకప్ 2023లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం పాకిస్థాన్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలంటే పాక్ జట్టు ఈ లక్ష్యాన్ని 7 ఓవర్లలోపు ఛేదించాల్సి ఉంది. ఈక్రమంలో పాక్ జట్టు సున్నా స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2.4 ఓవర్లకు 10 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయింది. ఇలా మొత్తంగా 6.2 ఓవర్లు పడిన తర్వాత పాక్ జట్టు స్కోరు 2 వికెట్లు కోల్పోయి 00 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ టీం అఫీషీయల్‌గా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. కెప్టెన్ బాబర్ ఆజం, రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ టీం తన చివరి లీగ్ మ్యాచ్ కాకుండా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 4 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్లతో 5 వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో సెమీస్ చేరకుండానే బాబర్ సేన ఇంటి ముఖం పట్టింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ నవంబర్ 15, బుధవారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 16న గురువారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్ .
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..