
ప్రపంచకప్-2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ భారీ విజయం సాధించింది. మంగళవారం (అక్టోబర్ 31) కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బంగ్లాపై గెలుపుతో ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది పాక్. ఈ విజయంతో ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. టోర్నీలో బాబర్ సేనకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ తో ఆ జట్టు ఆడాల్సి ఉంది. నవంబర్ 4న న్యూజిలాండ్‌తో, నవంబర్ 11న ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ జట్టు తలపడుతోంది. సెమీఫైనల్‌కు చేరుకోవడానికి పాకిస్థాన్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే పాకిస్థాన్ న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను భారీ తేడాతో ఓడించాలి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ గెలిస్తే 9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సొంతమవుతాయి. అలాగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి ఏ రెండు జట్లూ 12 కంటే ఎక్కువ పాయింట్లు సాధించకూడదు. అంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు, ఆఫ్గానిస్తాన్ జట్ల ప్రదర్శనపై కూడా పాక్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ఇతర జట్ల విషయానికి వస్తే.. ప్రపంచకప్‌లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2,3,4 స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో పాక్, ఆరో స్థానంలో ఆఫ్గనిస్తాన్, ఏడో ప్లేస్‌లో శ్రీలంక, 8,9,10 స్థానాల్లో వరుసగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.
ODI World Cup 2023
Points Table after the 31st Game of 45Bangladesh🆚Pakistan
India is on top with PTS 12 & NRR +1.405 #icccricketworldcup2023 #INDvENG #BreakingNews #CricketTwitter #ICCCricketWorldCup23 #Trending #CWC23INDIA #ViratKohli #RohitSharma𓃵 pic.twitter.com/1iPZ2AOtKm
— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) October 31, 2023
పాకిస్థాన్ క్రికెట్ జట్టు
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..