PAK vs WI: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్ టూర్ ముగిసింది. దీంతో లాహోర్‌కి బయలుదేరే ముందు ఆటీంకు ఓ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టు సభ్యులందరి కోవిడ్ -19 పరీక్ష చేయగా, ఇందులో జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను 10 రోజులు క్వారంటైన్‌లో ఉన్నాడు. జట్టు మొత్తం నెగెటివ్‌గా తేలింది. కోచ్ మినహా మిగిలిన జట్టు షెడ్యూల్ ప్రకారం లాహోర్‌కు బయలుదేరుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటనలో, “మిస్బాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ, పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను ప్రస్తుతం 10 రోజుల క్వారంటైన్‌లో ఉంటాడు. ఆ తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌గా తేలితే పాకిస్తాన్ చేరుకుంటాడు. పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఒక టెస్ట్, టీ20 సిరీస్ ఆడింది. ఇవి పూర్తి అయిన తర్వాత ప్రీ-డిపార్చర్ సమయంలో పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. దీనిలో పాజిటివ్‌గా తేలిన ఏకైక సభ్యుడు మిస్బా. షెడ్యూల్ ప్రకారం ఇతర సభ్యులందరూ బుధవారం జమైకాకు వెళ్తారు ” అని బోర్డు ప్రకటించింది.
మరోవైపు ఈ సిరీస్‌లో పాకిస్థాన్ అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడం ద్వారా ఓటమి నుంచి తప్పించుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ టీం పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇక్కడి నుంచి పాకిస్థాన్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంది. కానీ, రెండో టెస్ట్ మ్యాచ్‌లో, పాకిస్థాన్ గొప్ప ఆటను ప్రదర్శించి విజయం సాధించింది. సిరీస్‌ను టైతో ముగించింది. టాస్ ఓడిపోయిన తరువాత, పాకిస్తాన్ జట్టు స్కోరు 2 పరుగులకు 3వికెట్లు కోల్పోయింది. దీంతో బాబర్ అజామ్, ఫవాద్ ఆలం జట్టును కష్టాల నుంచి బయట పడేశారు. వీరిద్దరూ మూడో రోజు వరకు పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌ను చేపట్టారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా చాలా మంది మ్యాచ్ ఫలితాన్ని ఊహించలేదు. కానీ, పాకిస్తాన్ బౌలర్లు ముఖ్యంగా షహీన్ షా అఫ్రిది 10/94 రెండు ఇన్నింగ్స్‌లలో విండీస్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచడంతో పాకిస్తాన్ విజయం సాధ్యమైంది.
In pre-departure PCR testing, Misbah-ul-Haq has tested positive, he remains asymptomatic. Rest of the squad to fly out from Jamaica later today as scheduled.
We wish Misbah a speedy recovery.— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2021