
Pakistan : ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఒమన్ జట్టును 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 160 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఒమన్ జట్టు కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియాపై జరిగే మ్యాచ్‌కు ముందు ఈ విజయం పాకిస్తాన్‌కు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది. ఈ గెలుపు తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఒక పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఆటగాళ్లు ఇలాగే మంచి ప్రదర్శన ఇస్తూ పోతే, తాము ఏ జట్టునైనా ఓడిస్తామని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నారు. మ్యాచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. “మేము బ్యాటింగ్‌లో ఇంకా కొంచెం మెరుగుపడాలి. బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. బౌలింగ్ యూనిట్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాకు ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు, వారందరూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు” అని చెప్పాడు.
“మాకు 4-5 మంచి ఆప్షన్లు ఉన్నాయి. మేము దుబాయ్ , అబుదాబిలో ఆడేటప్పుడు ఈ ఆప్షన్లు చాలా అవసరం అవుతాయి. మేము మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 180 పరుగులు చేయాలని అనుకున్నాం, కానీ క్రికెట్ మనం అనుకున్నట్లు జరగదు. మేము నిజంగా మంచి క్రికెట్ ఆడుతున్నాము, మేము ట్రై-సిరీస్ గెలిచాము. ఈ రోజు మ్యాచ్ కూడా సులభంగా గెలిచాము. మేము మా ప్లాన్లను అమలు చేస్తే, ఏ జట్టునైనా ఓడిస్తాం” అని పాకిస్తాన్ కెప్టెన్ అన్నాడు.
శుక్రవారం జరిగిన ఆసియా కప్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓమన్‌పై 93 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ హారిస్ 66 పరుగులు చేశాడు. పాకిస్తాన్ 7 వికెట్లకు 160 పరుగులు చేయగా, ఓమన్ జట్టును కేవలం 16.4 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్ చేసి పెద్ద విజయాన్ని సాధించింది. ఓమన్ తరఫున హమ్మద్ మీర్జా అత్యధికంగా 27 పరుగులు చేశాడు. అతడు కాకుండా ఆమిర్ కలెమ్ (13), షకీల్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 14న గ్రూప్-ఎలో భారతదేశంతో తలపడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..