Virat Kohli: ఇప్పుడు విరాట్ కోహ్లీకి కావాల్సింది అదే.. పాక్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. అతను తన చివరి సెంచరీని 22 నవంబర్ 2019న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 12 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు.

Virat Kohli: ఇప్పుడు విరాట్ కోహ్లీకి కావాల్సింది అదే.. పాక్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli

Updated on: Jul 15, 2022 | 7:53 PM

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లికి మనోధైర్యాన్ని అందించేలా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ట్వీట్ చేశాడు. అతను గురువారం సోషల్ పోస్ట్‌లో కోహ్లీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ సమయం గడిచిపోతుంది, ధైర్యంగా ఉండండి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. బాబర్ ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ చర్చలకు దారితీసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రన్ మెషీన్ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పరుగుల కోసం పోరాడుతున్నాడు. 2019 నుంచి బ్యాట్‌తో సెంచరీ చేయలేదు. క్రికెట్ మాజీలు కూడా అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను విమర్శిస్తున్న వారిలో కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్ ఉన్నారు.

టీ 20లో ఫ్లాప్..

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతి తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. 2 టీ20 మ్యాచ్‌ల్లో 12 పరుగులు చేశాడు. అంతకుముందు 5వ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కోహ్లీ 11, 20 పరుగులు చేశాడు. గజ్జల్లో గాయం తర్వాత అతను ODI క్రికెట్‌లో తన అభిమాన ఫార్మాట్‌కు తిరిగి రాగానే నిరాశ చెందాడు.

ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో కోహ్లీ కేవలం 16 పరుగులకే ఔటయ్యాడు. 25 బంతులు ఎదుర్కొని 39 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా తొలి వన్డేలో ఆడలేకపోయాడు. దీని తర్వాత, వెస్టిండీస్ పర్యటనలో టీ 20 సిరీస్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించినప్పుడు, కోహ్లీకి అందులో విశ్రాంతిని ఇచ్చారు.

కోహ్లి గత మూడేళ్లుగా..

విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. అతను తన చివరి సెంచరీని 22 నవంబర్ 2019న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 12 ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ని విరాట్ కోహ్లీతో పోలుస్తుంటారు. ప్రస్తుతం బాబర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అతను టెస్టుల్లో 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2020 తర్వాత మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత రెండేళ్లలో పాకిస్థాన్ కెప్టెన్ 3508 పరుగులు చేశాడు. ఈ రెండేళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉన్నాడు.