- Telugu News Sports News Other sports Cwg 2022: 14 year old Delhi Girl Anahat Singh the youngest squash player in indian contingent focus on medal in Cwg 2022
కోహ్లీ స్పాన్సర్ షిప్‌తో సీడబ్ల్యూజీ 2022లో సత్తా చాటేందుకు సిద్ధమైన ప్లేయర్.. ఆమె స్పెషలేంటో తెలుసా?
అనాహత మొదట్లో బ్యాడ్మింటన్ ఆడేది. ఆమె అక్క స్క్వాష్ ప్లేయర్. 6 సంవత్సరాల వయస్సులో, ఆమె తన అక్కను చూసి స్క్వాష్ ఆడటం ప్రారంభించింది.
Updated on: Jul 15, 2022 | 3:12 PM

బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నుంచి 215 మంది ఆటగాళ్లతో కూడిన బృందం తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇందులో 14 ఏళ్ల స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ కూడా ఉంది. ఈ జట్టులో ఆమె అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. అనాహత గత కొన్నేళ్లుగా అండర్-15 విభాగంలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆ ప్రదర్శన ఆధారంగా ఆమెను భారత జట్టులో చేర్చారు.

అనాహత మొదట్లో బ్యాడ్మింటన్ ఆడేది. ఆమె అక్క స్క్వాష్ ప్లేయర్. 6 సంవత్సరాల వయస్సులో, ఆమె తన అక్కను చూసి స్క్వాష్ ఆడటం ప్రారంభించింది. చిన్న వయసులోనే పెద్ద సంచలనంగా మారిన ఆమె 8 ఏళ్లకే అండర్ 11 విభాగంలో దేశ నంబర్ వన్ క్రీడాకారిణిగా అవతరించింది.

అనాహత, ఆమె సోదరి అమీరా ఇద్దరూ మాజీ జాతీయ క్రీడాకారులు అమ్జాద్ ఖాన్, అష్రఫ్ హుస్సేన్‌లచే శిక్షణ పొందారు. స్క్వాష్‌ను ఒలింపిక్స్‌లో చేర్చి దేశానికి పతకం సాధించాలనేది ఆమె కలగా పేర్కొంది.

గతేడాది జరిగిన జూనియర్ యూఎస్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అనాహత విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఏ విభాగంలోనైనా టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలు ఆమె రికార్డు నెలకొల్పింది. ఇక్కడ నుంచే అనాహత తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఇది కాకుండా ఆమె 2019 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె అండర్ 15 విభాగంలో దేశంలో, ఆసియాలో నంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది.

అనాహత సింగ్‌కు భారత మాజీ కెప్టెన్, వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీతో కూడా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. అనాహతను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ స్పాన్సర్ చేసింది. కోహ్లి ఫౌండేషన్ అనాహతాతో పాటు సుమిత్ నాగల్, కర్మన్ కౌర్ థాండి వంటి టెన్నిస్ క్రీడాకారిణులతో సహా దేశంలోని అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సహాయం చేస్తుంది.




