Mohammad Hafeez: పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు క్రికెటర్ కుటుంబ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. జాతీయ టీ20 కప్ కోసం ఇస్లామాబాద్ చేరుకున్న వెంటనే క్రికెటర్ ఫుడ్ పాయిజన్‌తో బాధపడ్డాడని తెలిసింది. జియో న్యూస్ ప్రకారం.. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన జాతీయ టీ 20 కప్ మొదటి దశ నుంచి హఫీజ్ తప్పుకున్నాడు. ఫుడ పాయిజన్ కావడంతో తిరిగి లాహోర్ చేరుకున్నాడని తెలిసింది.
లాహోర్‌కు తిరిగి వచ్చిన తరువాత డాక్టర్లు స్టార్ క్రికెటర్ రక్త నమూనాను తీసుకుని, వైద్య పరీక్షలు చేశారంట. దీంతో హఫీజ్‌కు డెంగ్యూ పరీక్షగా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
“రెండు రోజుల క్రితం హఫీజ్ ప్లేట్‌లెట్ కౌంట్ బాగా పడిపోయింది” అని తెలియజేశాయి. ప్రస్తుతానికి ఈ పాక్ క్రికెటర్ బలహీనంగా ఉన్నాడని మరో పది రోజుల్లో మామాలు స్థితికి చేరుకుంటాని డాక్టర్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 26 న, హఫీజ్ జాతీయ టీ20 కప్ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. ఫుడ్ పాయిజన్ కారణంగా సెంట్రల్ పంజాబ్ క్రికెటర్ రావల్పిండిలో జరుగుతున్న మ్యాచ్‌ల నుంచి వైదొలగాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాహోర్‌లో జరిగే రెండో దశలో హఫీజ్ పంజాబ్ సెంట్రల్‌లో చేరనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
Also Read: MI Vs PBKS, IPL 2021: విఫలమైన పంజాబ్ బ్యాట్స్‌మెన్స్.. ముంబయి టీం టార్గెట్ 136
12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి..! 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టు పరువు కాపాడాడు..