PAK vs SL: శ్రీలంకతో డూర్ ఆర్ డై మ్యాచ్.. ప్లేయింగ్ 11ని ప్రకటించిన పాకిస్తాన్.. 5 మార్పులతో బరిలోకి

|

Sep 14, 2023 | 6:20 AM

Pakistan Playing 11 Against Sri Lanka, Asia Cup 2023: శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 5 మార్పులతో బరిలోకి దిగనుంది. ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అగా, నసీమ్ షా, హరీస్ రవూఫ్, ఫహీమ్ అఫ్రాష్ ఈ మ్యాచ్‌లో పాక్ జట్టులో భాగం కావడం లేదు. గాయం కారణంగా నసీమ్ షా ఆసియా కప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.

PAK vs SL: శ్రీలంకతో డూర్ ఆర్ డై మ్యాచ్.. ప్లేయింగ్ 11ని  ప్రకటించిన పాకిస్తాన్.. 5 మార్పులతో బరిలోకి
Pakistam Team
Follow us on

Pakistan Playing 11: ఆసియా కప్‌ 2023 లో గురువారం పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఇది డూ ఆర్ డై లాంటిది. నిజానికి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, ఓడిన జట్టు ప్రయాణం ముగుస్తుంది. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు పాకిస్థాన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది.

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో 5 మార్పులు..

శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 5 మార్పులతో బరిలోకి దిగనుంది. ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ అగా, నసీమ్ షా, హరీస్ రవూఫ్, ఫహీమ్ అఫ్రాష్ ఈ మ్యాచ్‌లో పాక్ జట్టులో భాగం కావడం లేదు. గాయం కారణంగా నసీమ్ షా ఆసియా కప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ కీలక మ్యాచ్ కోసం ఓపెనర్ మహ్మద్ హారిస్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ వసీమ్ జూనియర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్, ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్, స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్‌లు పాక్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరారు.

శ్రీలంకతో మ్యాచ్ కోసం పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ – మహ్మద్ హరీస్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, జమాన్ ఖాన్.

పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ సెమీఫైనల్ కంటే తక్కువేం కాదు..


పాకిస్తాన్, శ్రీలంక జట్లకు రెండింటికీ చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. కాబట్టి, గురువారం జరిగే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్‌గా మారింది. ఇందులో గెలిచిన జట్టు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే..

ఒకవేళ వర్షం కారణంగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ రద్దైతే.. ఆ మ్యాచ్ ఆడకుండానే శ్రీలంక జట్టు ఫైనల్ చేరుతుంది. నిజానికి పాకిస్థాన్ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ రద్దయితే శ్రీలంక ఫైనల్లోకి అడుగుపెట్టనుంది. సూపర్-4లో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -1.892లుగా నిలిచింది. కాగా, శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200లు మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..