AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం చెత్త నిర్ణయం.. థర్డ్ అంపైర్‌పై పాక్ బ్యాటర్ ఆగ్రహం.. ఏం చేశాడో తెలుసా? ఏకిపారేస్తోన్న నెటిజన్లు..

Shan Masood Video, PAK vs BAN: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు రావల్పిండి వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 16 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అందులో ఒక వికెట్ ఇప్పుడు వివాదానికి కారణమైంది.

Video: ఇదేం చెత్త నిర్ణయం.. థర్డ్ అంపైర్‌పై పాక్ బ్యాటర్ ఆగ్రహం.. ఏం చేశాడో తెలుసా? ఏకిపారేస్తోన్న నెటిజన్లు..
Shan Masood Video
Venkata Chari
|

Updated on: Aug 21, 2024 | 9:05 PM

Share

Shan Masood Video: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు రావల్పిండి వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 16 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అందులో ఒక వికెట్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. మొత్తానికి.. పాక్ కెప్టెన్ షాన్ మసూద్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయమే ఈ వివాదానికి కారణమైంది. బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం వేసిన బంతికి షాన్ మసూద్ కేవలం 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే, థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై పాక్ కెప్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పైన పేర్కొన్న విధంగా, షాన్ మసూద్ బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం డెలివరీ నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కి, ప్యాడ్‌కి చాలా దగ్గరగా వెళ్లింది. ఈ సమయంలో శబ్దం వచ్చింది. వెంటనే బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే షాన్ మసూద్‌ను ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ రివ్యూ తీసుకుంది. బంగ్లాదేశ్ అప్పీల్‌ను మరోసారి పరిశీలించిన థర్డ్ అంపైర్.. మసూద్ ఔట్‌గా ప్రకటించాడు.

కోపంతో షాన్ మసూద్ ఏం చేశాడంటే..

అయితే, థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడిన వెంటనే షాన్ మసూద్ షాక్ అయ్యి వెంటనే ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. బంతి తన తొడ ప్యాడ్‌కు తగిలిందని షాన్ మసూద్ వాదించాడు. అలాగే రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలిందా లేక ప్యాడ్‌కి తగిలిందా అనే దానిపై స్పష్టత రాలేదు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినందున, థర్డ్ అంపైర్ నిర్ణయం బ్యాటర్‌కు అనుకూలంగా రావాలి. అయితే, థర్డ్ అంపైర్ షాన్ మసూద్‌ను ఔట్‌గా ప్రకటించాడు.

ఇలా అంపైర్ నిర్ణయంపై మసూద్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ లోనే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. మసూద్ తన కోచ్‌కి మానిటర్‌లో రీప్లే చూపించి, అది నాటౌట్ అని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంపైర్ నిర్ణయంపై పాకిస్థాన్ సహాయక సిబ్బంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌కు బ్యాడ్ స్టార్ట్..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చాలా పేలవంగా ప్రారంభమైంది. నాలుగో ఓవర్‌లో అబ్దుల్లా షఫీక్ కేవలం 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. 7వ ఓవర్లో కెప్టెన్ షాన్ మసూద్ 11 పరుగులు చేసి ఔట్ కాగా, 9వ ఓవర్లో బాబర్ ఆజం ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..