World Cup 2023: నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌తోపాటు వేదికల వివరాలు ఇవే..

ODI World Cup 2023 warm-up matches: బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు సన్నాహక మ్యాచ్‌ల మొదటి రోజు అంటే సెప్టెంబర్ 29న రంగంలోకి దిగుతాయి. మిగిలిన నాలుగు జట్లు - ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, భారత్ శనివారం మైదానంలోకి రానున్నాయి. అక్టోబర్ 2, 3 తేదీల్లో రెండో సెట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్‌ జరగనుంది.

World Cup 2023: నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌తోపాటు వేదికల వివరాలు ఇవే..
World Cup Streaming

Updated on: Sep 29, 2023 | 5:30 AM

ODI World Cup 2023: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ODI ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం(Narendra Modi Cricket Stadium)లో ప్రారంభమవుతుంది. 48 మ్యాచ్‌ల టోర్నీ ఫైనల్ కూడా నవంబర్ 19న ఇదే వేదికపై జరగనుంది. భారత్‌లోని 10 వేదికల్లో 10 జట్లు లీగ్ దశ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. అయితే అంతకంటే ముందే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు తిరువనంతపురం, హైదరాబాద్, గౌహతి (Guwahati, Thiruvananthapuram, Hyderabad) అనే మూడు వేదికలలో ఐసీసీ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది.

బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రారంభ రోజున అంటే సెప్టెంబర్ 29 మొదటి రోజున రంగంలోకి దిగుతాయి. మిగిలిన నాలుగు జట్లు – ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, భారత్ శనివారం మైదానంలోకి రానున్నాయి. అక్టోబర్ 2, 3 తేదీల్లో రెండో సెట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

మూడు వేదికల వద్ద ప్రాక్టీస్ మ్యాచ్‌లు..

మొత్తం మూడు వేదికలు బుర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రెండో, చివరి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం టీమిండియా కేరళలోని తిరువనంతపురం వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ మ్యాచ్‌ల తేదీలు..

సెప్టెంబర్ 29, శుక్రవారం: బంగ్లాదేశ్ vs శ్రీలంక, బుర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి

సెప్టెంబర్ 29, శుక్రవారం: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

సెప్టెంబర్ 29, శుక్రవారం: న్యూజిలాండ్ vs పాకిస్థాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్

సెప్టెంబర్ 29, శుక్రవారం: ఇండియా vs ఇంగ్లండ్, బుర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.

సెప్టెంబర్ 29, శుక్రవారం: ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

అక్టోబర్ 2, సోమవారం: ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్, బుర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.

అక్టోబర్ 2, సోమవారం: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

అక్టోబర్ 3, మంగళవారం: ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, బుర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.

అక్టోబర్ 3, మంగళవారం: భారత్ vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

అక్టోబర్ 3, మంగళవారం: పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

అన్ని ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్‌ జరగనుంది.

ప్రత్యక్ష ప్రసార వివరాలు..

వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లు భారతదేశంలోని స్టార్ట్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సన్నాహక గేమ్‌ల ప్రత్యక్ష ప్రసారం భారతదేశంలోని Disney+Hotstar యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..