
డునెడిన్‌లోని యూనివర్శిటీ ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ సెంచరీతో అదరగొట్టాడు. పాక్ బౌలర్లను ఉతికారేస్తూ కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు ఫిన్ అలెన్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. మొదట కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అర్ధ సెంచరీ అనంతరం మరింత దూకుడిగా ఆడిన అలెన్.. పాక్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. ఫలితంగా కేవలం 48 బంతుల్లోనే భారీ సెంచరీ సాధించాడు. అంటే తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసేందుకు 26 బంతులు తీసుకున్న అలెన్.. ఆ తర్వాత కేవలం 22 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేశాడు. సెంచరీ తర్వాత కూడా పాక్ బౌలర్లను వదిలిపెట్టలేదు అలెన్. మ్యాచ్ లో మొత్తం 62 బంతులను ఎదుర్కొన్న ఫిన్ 16 సిక్సర్లు, 5 ఫోర్లతో 137 పరుగులు చేసి ఔటచకచాడే. ఈ యువ స్ట్రైకర్ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు భారీ స్కోరు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసి 45 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ విజయంతో మరో రెండు మ్యాచ్‌ల ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లోనూ పరాజయం పాలైంది.
విశేషమేమిటంటే గత మూడు సీజన్లలో ఫిన్ అలెన్ RCB జట్టులో ఉన్నాడు. మూడేళ్లపాటు జట్టులో ఉన్నప్పటికీ, అలెన్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు RCB అనుమతించలేదు. అలాగే ఈసారి ఐపీఎల్‌కు ముందు యువ ఆటగాడిని జట్టు నుంచి తప్పించారు. అయితే ఇప్పుడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు అలెన్.
A 48-ball century by Finn Allen 🔥
New Zealand are flying in the third #NZvPAK T20I!
Follow live: https://t.co/XUheCbAUFu pic.twitter.com/HhXceyfZlz
— ICC (@ICC) January 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..