Babar Azam: బాబర్‌ ఆజామ్‌ డెడ్లీ సిక్సర్‌.. బంతి తగిలి అభిమాని విలవిల.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో

|

Jan 17, 2024 | 11:25 AM

డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20లో పాక్ జట్టు 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. దీనిని చూసి పాక్‌, న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. డునెడిన్‌ వేదికగా 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాక్ జట్టులో బాబర్ అజామ్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన బాదర్‌ ఒక భారీ సిక్సర్‌ కొట్టాడు

Babar Azam: బాబర్‌ ఆజామ్‌ డెడ్లీ సిక్సర్‌.. బంతి తగిలి అభిమాని విలవిల.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో
Babar Azam
Follow us on

పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ దాయాది ఆటతీరు మారలేదు. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో తొలి టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్థాన్ టీ20 సిరీస్‌ను కోల్పోయింది.  తాజాగా డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20లో పాక్ జట్టు 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. దీనిని చూసి పాక్‌, న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. డునెడిన్‌ వేదికగా 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాక్ జట్టులో బాబర్ అజామ్ అత్యధికంగా 58 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన బాదర్‌ ఒక భారీ సిక్సర్‌ కొట్టాడు. అయితే ఈ షాట్‌ ఒక అభిమానికి ప్రాణపాయాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. బాబర్‌ స్క్వేర్ లెగ్ వైపు భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ బంతి నేరుగా బౌండరీ రోప్ దగ్గర నిలబడి ఉన్న అభిమానిపై పడింది. బంతి అతని తలకు తగిలిందనుకున్నారు.అయితే సదరు అభిమాని తన చేతితో తనను తాను రక్షించుకున్నాడు. దీంతో కొద్ది పాటి గాయాలతో మాత్రమే బయటపడ్డాడు. అయితే బంతి బలంగా తాకడంతో చాలా సేపు విలవిల్లాడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో కూడా బాబర్ అజామ్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు. బాబర్‌ మినహా పాకిస్థాన్‌కు చెందిన ఏ బ్యాటర్‌ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. శ్యామ్ అయ్యూబ్ 10 పరుగులు, ఫఖర్ జమాన్ 19 పరుగులు చేశారు. రిజ్వాన్ కూడా 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇఫ్తికార్ 1, ఆజం ఖాన్ 10 పరుగులు చేయగలిగారు. పాక్ జట్టు 20 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీతో మ్యాచ్‌ తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది పాక్‌. అంతకు ముందు ఫిన్ అలెన్ భీకరంగా రెచ్చిపోయాడు.ఈ కుడిచేతి వాటం ఓపెనర్ కేవలం 62 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 16 సిక్సర్లు కొట్టాడు. టీ20లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక స్కోరు, ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

బాబర్ బాగానే ఆడినా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..