క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో.. టీమిండియా 219 పరుగులకు అలౌటయింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 1-0 వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ టీమిండియాకు తప్పనిసరిగా గెలవాల్సిన వన్డే. మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత ఆటగాళ్లు తొలుత శుభారంభాన్ని అందించినా.. ఓపెనింగ్స్ ప్లేయర్స్ ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పెవీలియన్ బాట పట్టారు. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్(51) అర్థ శతకాన్ని సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్(49), శిఖర్ ధావన్(28) మినహా ఆటగాళ్లందరూ పేలవ ప్రదర్శననిచ్చారు. భారత్ కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమాన్ గిల్ టీమ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరు కలిసి 39 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. తొమ్మిదో ఓవర్‌లో గిల్‌ను ఆడమ్ మిల్నే ఔట్ చేశాడు. ధావన్ కూడా వెనువెంటనే నిష్క్రమించడంతో ఒక వికెట్ తర్వాత మరో వికెట్ అన్నట్లుగా న్యూజిలాండ్ ఆటగాళ్లు వికెట్లను పడగొట్టడం ప్రారంభించారు.
అయితే గిల్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ బాగా ఆడుతున్నప్పటికీ మిగిలిన ఆటగాళ్ల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇంకా కివీస్ ప్లేయర్లు తమ బౌలింగ్‌తో దాడిచేయడంతో అయ్యర్ 8 ఫోర్లతో 49 పరుగుల వద్ద తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో అతను తన 14వ వన్డే అర్థ సెంచరీని ఒక్క పరుగుతో మిస్సయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, దీపక్ హుడా ఇంకా ఫామ్‌లో ఉన్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కలిసి కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక భారత్ 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుందని అనిపించిన తరుణంలో, వాషింగ్టన్ సుందర్ గట్టిగా పుంజుకున్నాడు.
.@Sundarwashi5 scored a fighting half-century & was our top performer from the first innings of the third #NZvIND ODI. ? ? #TeamIndia
A summary of his knock ? pic.twitter.com/4JcYJkRmdG
— BCCI (@BCCI) November 30, 2022
అంతర్జాతీయ సర్క్యూట్‌లో అతనికి అనుభవం లేకపోయినా ఒత్తిడిలో కూడా చాలా ప్రశాంతంగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను తన వన్డే కెరీర్‌లో తొలి అర్థ సెంచరీని కూడా సాధించాడు. కాగా న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ వేసిన 48వ ఓవర్‌లో సుందర్ తన వికెట్‌ను కోల్పోయాడు. అయితే అతని సహాయంతోనే భారత స్కోర్ 149/6 వద్ద నుంచి 219 పరుగులకు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చేరో మూడు వికెట్లను పడగొట్టగా.. టిమ్ సౌథీ రెండు, ఫెర్గుసన్, సాన్ట్నర్ చేరో వికెట్ తీశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..