IPL 2023: గిల్ కాదు.. తిలక్ లేడు.. ప్రపంచ క్రికెట్‌లో నయా సూపర్ స్టార్ అతడే.. షాకిచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్..

Irfan Pathan: ప్రపంచ క్రికెట్‌లో దుమ్ము రేపనున్న ప్లేయర్ ఎవరో చెప్పేశాడు. అయితే, టీమిండియా నుంచి మాత్రం కాదంటూ షాకిచ్చాడు. టీమిండియా నుంచి శుభమన్ గిల్ లేదా తిలక్ వర్మలపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దిరిని పక్కన పెట్టి.. మరో యంగ్ ప్లేయర్‌ను ప్రపంచ క్రికెట్‌లో మొనగాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

IPL 2023: గిల్ కాదు.. తిలక్ లేడు.. ప్రపంచ క్రికెట్‌లో నయా సూపర్ స్టార్ అతడే.. షాకిచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్..
Mumbai Indians 2023

Updated on: Apr 19, 2023 | 9:11 PM

ఐపీఎల్ నుంచి ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌లోనూ ఇలాంటి ప్లేయర్లు చాలామందే ఉన్నారు. అయితే, ఈ క్రమంలో భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌లో దుమ్ము రేపనున్న ప్లేయర్ ఎవరో చెప్పేశాడు. అయితే, టీమిండియా నుంచి మాత్రం కాదంటూ షాకిచ్చాడు. టీమిండియా నుంచి శుభమన్ గిల్ లేదా తిలక్ వర్మలపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దిరిని పక్కన పెట్టి.. మరో యంగ్ ప్లేయర్‌ను ప్రపంచ క్రికెట్‌లో మొనగాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత మాజీ పేసర్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్(MI) ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారతాడంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఆస్ట్రేలియన్ వచ్చిన ప్రతి అవకాశంలో తన సత్తా చాటుకుంటూ.. తన ఆటను మరింత పెంచుకుంటున్నాడంటూ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదో ర్యాంక్‌ను అధిగమించడంలో గ్రీన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మగళవారం, ఏప్రిల్ 18, 2023న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ గేమ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీం ఘన విజయం సాధించి, హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.

గ్రీన్ 40 బంతుల్లో 64 పరుగులు చేయడంతో ముంబై SRHపై 6 వికెట్లకు 192 పరుగుల భారీ స్కోరును అందించింది. “కామెరాన్ గ్రీన్ ప్రపంచ క్రికెట్‌లో తదుపరి సూపర్‌స్టార్ కాబోతున్నాడు. అతను ప్రతిభావంతుడైన ఆటగాడు. అతని నుంచి ఆశించిన దానికంటే ఎక్కువగానే చూస్తాం. ఎందుకంటే అతను రోజురోజుకు తన ఆటను పెంచుకుంటున్నాడు” అని స్టార్ స్పోర్ట్స్‌‌లో పఠాన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

బ్యాట్‌తో మాత్రమే కాకుండా, గ్రీన్ బంతితో ఆకట్టుకున్నాడు. 29 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఆఖరి ఓవర్‌లో అర్జున్ టెండూల్కర్ గేమ్‌ను ముగించడంతో పాటు తమ వంతు పాత్రను పోషించాడు. “జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వంటి సూపర్ స్టార్లు లేని సమయంలో.. యంగ్ ప్లేయర్లే ముంబై ఇండియన్స్‌కు అండగా నిలుస్తున్నారు. జట్టు మొదటి రెండు గేమ్‌లలో కోల్పోయినా.. హ్యాట్రిక్ విజయాలతో దూసుకపోతోంది” అంటూ ఫించ్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..