Test Cricket Records: తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డ్‌లో చేరిన యంగ్ బౌలర్.. లిస్టులో భారత ప్లేయర్ కూడా..

Nijat Masood: బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నిజత్ మసూద్ తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 7వ బౌలర్‌గా కూడా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. 1991లో ఇంగ్లండ్ బౌలర్ రిచర్డ్ పదర్పణ అరంగేట్రం మ్యాచ్ తొలి బంతికే వికెట్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Test Cricket Records: తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డ్‌లో చేరిన యంగ్ బౌలర్.. లిస్టులో భారత ప్లేయర్ కూడా..
Afghanistans Nijat Masood C
Follow us
Venkata Chari

|

Updated on: Jun 15, 2023 | 7:06 PM

Nijat Masood: మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ పేసర్ నిజాత్ మసూద్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఓవర్లో 6 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన యువ పేసర్ నిజత్ మసూద్ 2వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

జకీర్ హసన్ అల్లా పదర్పణను తొలి బంతికే పెవిలియన్ చేర్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన ఆఫ్ఘనిస్థాన్‌ తొలి బౌలర్‌గా నిజత్‌ మసూద్‌ నిలిచాడు.

ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 7వ బౌలర్‌గా కూడా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. 1991లో ఇంగ్లండ్ బౌలర్ రిచర్డ్ పదర్పణ అరంగేట్రం మ్యాచ్ తొలి బంతికే వికెట్ తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

భారత బౌలర్ కూడా ఈ ఘనత సాధించిన లిస్టులో చేరాడు. 1997లో శ్రీలంకపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీలేష్ కులకర్ణి తన తొలి బంతికే ఓపెనర్ మార్వాన్ అటపట్టును అవుట్ చేశాడు.

అలాగే టెస్టు క్రికెట్‌లో చివరిసారిగా 2016లో ఈ ఘనత సాధించింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ హార్డస్ విల్లోన్ తన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే ఇంగ్లండ్‌ ఆటగాడు అలిస్టర్‌ కుక్‌ను అవుట్ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత అఫ్గాన్‌ పేసర్‌ నిజాత్‌ మసూద్‌ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..